20 మందిని కొడితే 510 కోట్ల షేర్… మరి 40 మందిని కొడితే..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముంబైలో వార్ సీక్వెల్ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. 40 మందితో ఏకంగా 20 అంతస్థుల్లో భారీ ఫైట్ ని ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. హ్రితిక్ రోషన్ అండ్ కో తో తను చేసే ఈ భారీ ఫైట్ కోసం నిజంగానే 20 అంతస్థుల స్టీల్ స్టేర్ కేస్ సెట్ ని రెడీ చేశారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముంబైలో వార్ సీక్వెల్ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. 40 మందితో ఏకంగా 20 అంతస్థుల్లో భారీ ఫైట్ ని ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. హ్రితిక్ రోషన్ అండ్ కో తో తను చేసే ఈ భారీ ఫైట్ కోసం నిజంగానే 20 అంతస్థుల స్టీల్ స్టేర్ కేస్ సెట్ ని రెడీ చేశారు. ఐతే ఇక్కడే ఒక పోలిక వెయ్యికోట్ల వసూల్లని కన్ఫామ్ చేస్తోంది. దేవరలో తను ఇరవై మందితో చేసిన ఫైట్ తోనే 510 కోట్ల షేర్ వసూళ్లు వస్తే, ఇక ఇప్పుడు లెక్క డబుల్ అయ్యేలా ఉంది. ప్రజెంట్ 40 మందితో వార్ 2 ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ తెరకెక్కుతోంది. దీనికి కనీసం 100 రెట్లు మించి ఉండేలా, క్లైమాక్స్ సీన్ ని ప్లాన్ చేశారు. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి క్లైమాక్స్ షూటింగ్ మొదలవ్వొచ్చట. ప్రజెంట్ క్లైమాక్స్ షూటింగ్ ప్లాన్ చేసి, ఇంటర్వెల్ బ్యాంగ్ తాలూకు సీన్ల రీషూట్స్ జరుగుతున్నాయి. ఐతే 4000 మందితో భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఫైట్ సీన్ ని, ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ సాయంతో ప్లాన్ చేశారట. కాని 400 మంది ఒరిజినల్ ఫైటర్స్ ని వాడి, ఆతర్వాత ఆ సీన్ ని పదిరెట్లు ఫైటర్స్ సంఖ్యను పెంచాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇదొక్కటి మాత్రం బాలీవుడ్ మీడియాలో లీకై, వార్ 2 ఫైట్ సీన్ షాకిస్తోంది… ఇది వింటానికే ఇలా ఉంటే, రియాలిటీ ఏ రేంజ్ లోఉంటుందో ఊహించొచ్చు… వార్ 2 అని పేరు పెట్టినందుకు, నిజంగా ఒకప్పటి యుద్ధాలని చూపించేలా ఉంది ఫిల్మ్ టీం…
దేవర కేవలం ప్రి క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్స్ లో 20 మందిని ఉతిక ఆరేస్తే, ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 510 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ కలెక్సన్స్ ఎప్పుడో థౌజెండ్ వాలాగా మారాయి. సో ఒక్క మూవీలో ఒకేసారి 20 మందితో ఊహాతీతమైన ఫైట్ చేస్తే ఇలాంటి రెస్పాన్స్ వస్తే, మరి వార్ 2 లో ఏకంగా 40 మందితో 20 అంతస్థుల మీద భారీ ఫైట్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరి దానికి ఎన్ని వందలకోట్ల వసూళ్లు రావాలి..
వింటానికి విచిత్రంగా ఉన్నా ఫైట్ చేస్తే కోట్లొస్తాయా అంటే, అక్కడే మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకుంటున్నారు దర్శకులు. కంటెండ్ డ్రివెన్ స్టోరీలు చూసిన జనాలకు ఫైట్లు, పంచ్ డైలాగ్స్ పెద్దగా ఎక్కవు.. కాని మాస్ ఆడియన్స్ కి అవి లేకపోతే, సినిమాలు నచ్చవు. ఇంకా అలాంటి వి చూస్తున్నారా, అంటే అలాంటి డౌట్లు పెట్టుకునే బాలీవుడ్ బక్కెట్ తన్నేస్తోంది
అలాంటి అగ్నానం లేదుకనకే, తెలుగు డైరెక్టర్లు తీస్తున్నమాస్ మూవీలు, నార్త్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ లా మారుతున్నాయి. ఇదేదో ఎమోషనల్ గా తెలుగు సినిమాను సపోర్ట్ చేసే స్టేట్ మెంట్ కాదు, సర్వేలు, స్టాటిస్టిక్స్ నుంచి తేలిన అంశమే ఇది
ఒకప్పుడు తెలుగు సినిమాను హిందీ నిర్మాతలు నార్త్ రైట్స్ కొనాలంటే కండీషన్స్ విచిత్రంగా ఉండేవి… సినిమాలో ఎన్ని ఫైట్లున్నాయి… ఎన్ని ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి, పంచ్ డైలాగ్ సీన్స్ ఎన్ని,… వీటిని బట్టి సినిమాలో ఇన్ని ఫైట్లు ఉంటే అన్ని కోట్లంటూ నార్త్ ఇండియా నిర్మాతలు తెలుగు సినిమా డబ్బింగ్ రైట్స్ కొనేవాల్లు.. ఈ ట్రెండు బాహుబలి 1, బాహుబలి 2 రిలీజ్ అయిన టైంలోకూడా ఉంది… ఇప్పడు ఏ తెలుుగ సినిమా హిందీ రైట్స్ అయినా గట్టిగా రాబట్టాలంటే, అందులో సాలిడ్ గా ఫైట్లు ఉండి తీరాల్సిందే.
నార్త్ ఆడియన్స్ లో 80శాతం మహా మాస్ ఫాలోవర్సే…. కాబట్టే వాళ్లకి హిందీ సినిమాలు కనెక్ట్ కావట్లేదు… మన తెలుగు సినిమా వస్తే వాళ్లు వదిలే ప్రశ్నే లేదు.. అందుకే సౌత్ లో కంటే దేవర నార్త్ లోనే ఒకటికి పది రెట్లు వసూల్ల వర్షం కురిపించింది. ఇంకా కురిపిస్తూనే ఉంది. అలాంటిది ఇప్పడు డైరెక్ట్ గా హిందీలో వార్ సీక్వెల్ వార్ 2 లో ఎన్టీఆర్ కనిపిస్తే, 40 మంది ఫైటర్స్ లో భారీ యాక్షన్ సీన్ లో దుమ్ముదులిపితే, ఇక బాక్సాఫీస్ లో కనకవర్షమే
అంతేకాదు ఇంటర్వెల్ బ్యాంగ్ కే 40 మందితో ఫైట్ డిజైన్ చేస్తే, క్లైమాక్స్ 4 వేల మందితో ప్లాన్ చేశారు. కాకపోతే సెట్లో 400 మంది ఫైటర్స్ తో లార్జర్ దేన్ లైఫ్ అనిపించే ఫైట్ ని పెట్టబోతున్నారు. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో 400 మంది ని కాస్త 4 వేల మంది ఫైటర్స్ గా మార్చి విజువల్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేయబోతున్నారు. అచ్చంగా త్రిబుల్ ఆర్ లో 1200 మందితో రామ్ చరణ్ ఫైట్ చేసే సీన్ తీసినట్టే, ఇది తీయబోతున్నారు. కాకపోతే ఇక్కడ ఫైటర్స్ సంఖ్య మూడింతలైంది… కాబట్టే వార్ 2 మూవీకి వెయ్యికోట్ల వసూళ్లు పెద్ద విషయమే కాదని తేలింది. కేవలం నార్త్ ఇండియాలోనే ఈ సినిమా వెయ్యికోట్లు రాబట్టిన ఆశ్చర్యంలేదు. ఆరేంజ్ ఫైట్లు ఉన్నాక రిజల్ట్ రీసౌండ్ చేయక తప్పదు.