540 కోట్ల ప్రభాస్… 350 కోట్ల ఎన్టీఆర్.. 280 కోట్ల బన్నీ వెనక ట్విస్ట్..

ఇండియా మొత్తంలోనే 500 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ఏకైక స్టార్ రెబల్ స్టార్. తర్వాత ప్లేస్ ఏ షారుఖ్ ఖానో, రజినీకాంతో అనుకుంటే, రెండో స్థానంలో 350 కోట్లతో తిష్టవేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ఈ వార్త ఎప్పుడో వైరలైంది. కట్ చేస్తే పుష్ప2 రిలీజ్ టైంలో 280 కోట్లు తీసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ,

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2024 | 06:30 PMLast Updated on: Dec 06, 2024 | 6:30 PM

540 Crore Prabhas 350 Crore Ntr 280 Crore Bunnys Twist Behind It

ఇండియా మొత్తంలోనే 500 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ఏకైక స్టార్ రెబల్ స్టార్. తర్వాత ప్లేస్ ఏ షారుఖ్ ఖానో, రజినీకాంతో అనుకుంటే, రెండో స్థానంలో 350 కోట్లతో తిష్టవేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ఈ వార్త ఎప్పుడో వైరలైంది. కట్ చేస్తే పుష్ప2 రిలీజ్ టైంలో 280 కోట్లు తీసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ, పుష్ప2 కి భారీ హైప్ తెచ్చారు. కాని తీరా చూస్తే పుష్ప రాజ్ ఇంకా 100 కోట్ల లోపే తీసుకుంటున్నాడట. అలాగని 280 కోట్లు తీసుకోలేదా అంటే తీసుకున్నాడు. కాని ఆ లెక్క వెనకున్న మతలబే షాక్ ఇస్తోంది. బన్నీ ఒక సినిమాకు తీసుకునే పారితోషికం చూస్తే, రెబల్ స్టార్ ప్రభాస్ మూడునెలల రెమ్యునరేషన్ తో సమానమట… అదెలా? ఇంతకి పాన్ ఇండియా స్టార్ హీరోలందరి పారితోషికాల్లో వచ్చిన సడన్ ఛేంజర్ ఏంటి? చూసేయండి.

పుష్ప 2 మూవీకి 280 కోట్లు తీసుకున్న బన్నీ అన్న వార్త వైరలైంది. ఇది నిజంగా నిజమే.. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇండియాలోనే అత్యధికంగా పారితోషికం తీసుకునే ఏకైక పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తను ఆదిపురుష్ టైంలోనే 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు

అలాంటిది కల్కీకి 350 కోట్లు, ఫౌజీకి 350 కోట్లు, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లోతెరకెక్కే స్పిరిట్ కి 540 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడట. ఇది కాకుండా ఏరియా రైట్స్ అదనంగా దక్కుతున్నాయి కాబట్టే, రెమ్యునరేషన్ విషయంలో ఖాన్లూ, కపూర్లు, తమిళ సూపర్ స్టార్ తోపాటు చైనా,కొరియా హీరోలని మించి హాలీవుడ్ స్టార్ల తో సరిసమానంగా దూసుకెళుతున్నాడు

రెమ్యునరేషన్ లో వరల్డ్ టాప్ టెన్ స్టార్స్ లో ప్రభాస్ ది ఎనిమిదో స్థానం అని తేలిపోయింది. ఆతర్వాత ఎవరు ఇండియాలో అంటే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తోంది. తను త్రిబుల్ ఆర్ కి కేవలం 75 కోట్లే తీసుకుని, దేవరకి 150 కోట్లు తీసుకున్నాడన్నారు. కట్ చేస్తే వార్ 2 హిందీ మూవీకి 200 కోట్లు తీసుకుంటున్న తను తెలుగు రాష్ట్రాల రైట్స్ ని అదనంగా పొందాడు.. అంటే కనీసం 300 కోట్లు తనకు సొంతమైనట్టే

ఇక డ్రాగన్ కి ఏకంగా 350 కోట్లు తీసుకుంటున్న తను, ధూమ్4 లో స్పెషల్ రోల్ కి కూడా స్పెషల్ ఎమౌంటే తీసుకుంటున్నాడు. ఇలాంటి టైంలో రెమ్యునరేషన్ విషయంలో పాన్ ఇండియా స్టార్స్ లో మూడో హీరోగా బన్నీ పేరు మారుమోగుతోంది. అది నిజమేనా అంటే, ఆ నిజం వెనక ట్విస్ట్ ఉంది

పుష్ప 2 మూవీ 3ఏళ్లు తెరకెక్కించారు. కాబట్టి ఏడాదికి 90 కోట్ల చొప్పున 270 నుంచి 280 కోట్లు తీసుకున్నాడట బన్నీ. అంటే ఏడాదికో మూవీ అనుకుంటే,తన పారితోషికం 100 కోట్లు కూడా రీచ్ కానట్టే… ప్రభాస్ తో ఫౌజీని 6 నెలల్లో పూర్తి చేసే పనిలో ఉన్నాడు హను రాఘవపూడీ. ఈమూవీకి 350 కోట్లంటే అందులో సగం 175 కోట్లు.. అంతకూడా బన్నీకి ఒక ఏడాదికి దక్కట్లేదు. ఇదే లాజిక్ అర్ధం కాక ప్రభాస్, ఎన్టీఆర్ ని వేగంగా రీచైన బన్నీ అంటూ భారీ హైప్ తెస్తున్నారనే వాదన పెరిగింది

1000 కోట్లు వర్షం రెండుసార్లు రాబట్టిన షారుఖ్ ఖానే 250 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. తమిళ స్టార్ విజయ్ కోలీవుడ్ లోనే తన ఫ్లాప్ మూవీ గోట్ తో 580 కోట్లు రాబట్టి, 280 కోట్లు తీసుకుంటున్నాడు. అలాంటిది బన్నీ పుష్ప 2 కే 280 కోట్లు తీసుకుంటున్నాడనటం అతిగా ప్రమోట్ చేయటమే అన్న కామెంట్లు పెరిగాయి.