బుక్ మై షోలో 3 రోజుల్లో 6 లక్షల టికెట్ లు బుక్, బుకింగ్ యాప్స్ ను రే** చేస్తున్న దేవర…
దీనెమ్మ క్రేజ్ టాలీవుడ్ లో ఏ సినిమాకు గతంలో లేదు, భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు గాని దేవర బజ్ ఓ రేంజ్ లో ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ టికెట్ ల కోసం భూకంప బాధితులు ఆహార పొట్లాల కోసం ఎదురు చూసినట్టు చూస్తున్నారు. ఆ
దీనెమ్మ క్రేజ్ టాలీవుడ్ లో ఏ సినిమాకు గతంలో లేదు, భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు గాని దేవర బజ్ ఓ రేంజ్ లో ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ టికెట్ ల కోసం భూకంప బాధితులు ఆహార పొట్లాల కోసం ఎదురు చూసినట్టు చూస్తున్నారు. ఆరేళ్ళ నుంచి ఉన్న ఆకలి అది. అప్పుడు రిలీజ్ ఇప్పుడు రిలీజ్ అని ఫ్యాన్స్ కి పిచ్చి ఎక్కించారు. మరి ఆ రేంజ్ లో ఆకలి ఉండటంలో తప్పు లేదు కదా…? బుడ్డోడికి బాక్సాఫీస్ లో ఉన్న క్రేజ్, దమ్ము ఇప్పుడు జనాలకు అర్ధమవుతుంది. అమెరికా నుంచి అమలాపురం వరకు తొక్కుకుంటూ పోతున్నాడు.
అమెరికాలో ప్రీ బుకింగ్ మార్కెట్ చూసి బాలీవుడ్ జనాలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఏందిరా… ఏముందిరా అంత అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ మొత్తం దేవర ఓ రేంజ్ లో సెన్సేషన్ అవుతోంది. విడుదలకు ఇంకా 2 రోజులు సమయం ఉంది. ఈ రెండు రోజుల్లో సినిమా ఏ రికార్డులు బద్దలు కొడుతుందో అర్ధం కావడం లేదు. ప్రముఖ బుకింగ్ యాప్స్… బుక్ మై షో, పేటిఎంలో సంచలనాలు నమోదు చేస్తోంది దేవర. సినిమా ఎలా ఉంటుందో తెలియక ముందే ఇదంతా.
హిట్ అనే టాక్ వస్తే సినిమాను ఆపడం ఎవడి తరం కాదు. అసలు గత మూడు రోజుల్లో బుక్ మై షో లో బుక్ అయిన టికెట్ ల లెక్క చూద్దాం. సెప్టెంబర్ 22న… కేవలం కర్ణాటక రాష్ట్రంలోనే 35 వేల 200 టికెట్ లు బుక్ చేసారు. సెప్టెంబర్ 23న… లిమిటెడ్ షోస్ కి ఆంధ్రా, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షా 7 వేల 300 టికెట్ లు బుక్ అయ్యాయి. సెప్టెంబర్ 24న 3 లక్షల 62 వేల 800 టికెట్ లు బుక్ చేసారు. మొత్తంగా గత మూడు రోజుల్లో 5 లక్షల 3 వేల 420 ప్లస్ టికెట్ లు బుక్ అయ్యాయి. ఇంకా విడుదలకు 2 రోజులు ఉంది. అంటే ఏ రేంజ్ లో సినిమా పై క్రేజ్ ఉందో మీరే ఊహించుకోవచ్చు.