3 రోజుల్లో 6 లక్షల డాలర్లు.. అమెరికాలో తండెల్ రాజు విధ్వంసం
నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన తండేల్.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఈనెల 7న రిలీజ్ కాగా అప్పటినుంచి గ్రాండ్ సక్సెస్ టాక్ తో రన్ అవుతుంది.

నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన తండేల్.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఈనెల 7న రిలీజ్ కాగా అప్పటినుంచి గ్రాండ్ సక్సెస్ టాక్ తో రన్ అవుతుంది. నాగచైతన్య కెరీర్ లోనే తండెల్ భారీ హిట్టుగా చెప్పుకోవచ్చు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ సినిమాకు రిజల్ట్ కూడా అదే రేంజ్ లో ఉంది. హీరో హీరోయిన్ల నటనకు అభిమానులు మాత్రమే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా ఈ రేంజ్ లో గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు.
సినిమా ప్రమోషన్స్ కూడా ఓవర్సీస్ లో గట్టిగానే చేయడంతో రిజల్ట్ కూడా అదే రేంజ్ లో వచ్చిందని చెప్పాలి. మన తెలుగు రాష్ట్రాల్లో కంటే ఓవర్సీస్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉంది. వేరే తెలుగు సినిమాలు ఏవి లేకపోవడం, అటు బాలీవుడ్ సినిమాలు కూడా లేకపోవడంతో ఈ సినిమాకు జనాలు క్యూ కట్టారు. దానికి తోడు లాంగ్ వీకెండ్ కూడా రావడంతో అమెరికాలో ఈ సినిమాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అసలు తెలుగు సినిమా చూడని చోట కూడా ఈ సినిమా కాస్త కూస్తో ప్రభావం చూపించింది.
దీంతో నాగచైతన్య కెరీర్ లో అమెరికాలో భారీ కలెక్షన్స్ సాధించే సినిమాగా తండెల్ నిలిచే ఛాన్స్ కనబడుతోంది. చందు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. తెలుగు స్టేట్స్ లో రెస్పాన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా మూడో రోజు సినిమాకు భారీగా వసూళ్లు వచ్చాయి. ఇక అమెరికా మార్కెట్ విషయానికొస్తే అక్కడ ఆరు లక్షల డాలర్స్ ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లో కచ్చితంగా 1 మిలియన్ మార్క్ దాటే ఛాన్స్ కనబడుతోంది.
దీనితో అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు అక్కినేని హీరోల గురించి అసలు ఓవర్సీస్ లో చర్చ జరగలేదు. వేరే హీరోల సినిమాలు అన్ని ఓవర్సీస్ లో దుమ్ము రేపుతుంటే అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలకు మాత్రం అక్కడ రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి చాలా మారిందనే చెప్పాలి. అమెరికా బాక్స్ ఆఫీస్ లో ఈ మధ్య తెలుగు సినిమాల డామినేషన్ కనబడుతోంది. ఇక ఇప్పుడు నాగచైతన్య కూడా వార్ డిక్లేర్ చేయడంతో తెలుగు సినిమాకు అమెరికా మార్కెట్లో తిరుగు లేదంటున్నారు అక్కడి జనాలు. అటు ఆస్ట్రేలియా యూకే లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కచ్చితంగా 100 నుంచి 130 కోట్లు సినిమా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు అనే టాక్ వినబడుతుంది. దీనిపై అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ జనాలు కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు.