600 కోట్ల కాపీనా..? బన్నీ సినిమాకు కాపీ రైట్స్ షాక్..!

పుష్ప2 హిట్ ఊపులో ఉన్న బన్నీకి మాత్రం అడుగడుగునా ఎన్టీఆర్, ప్రభాస్ గండంలా మారుతున్నారు. పాన్ ఇండియా మార్కెట్ ని కుదిపేసే రేంజ్ ఉన్న దర్శకులంతా, ఈ ఇద్దరు హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2025 | 05:02 PMLast Updated on: Apr 14, 2025 | 5:02 PM

600 Crore Copy Bunny Movie Copyrights Shock

పుష్ప2 హిట్ ఊపులో ఉన్న బన్నీకి మాత్రం అడుగడుగునా ఎన్టీఆర్, ప్రభాస్ గండంలా మారుతున్నారు. పాన్ ఇండియా మార్కెట్ ని కుదిపేసే రేంజ్ ఉన్న దర్శకులంతా, ఈ ఇద్దరు హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. ఫలితంగా రెండు మూడేళ్ళ వరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి హిట్లిచ్చే దర్శకుల కరువొచ్చింది. దీంతో ఆట్లీతో 600 కోట్ల బడ్జెట్ లో భారీ రిస్క్ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే, అరవోళ్లకు కూడా 1000 కోట్ల హిట్ ఇచ్చే మొనగాడు మనోడే అన్న డిస్కర్షన్ మొదలైంది. అసలే అరవోళ్లని నమ్ముకుంటే, తెలుగు హీరోలకి డిజాస్టర్లే గతనే సెంటిమెంట్ ఉంది. శంకర్, మణిరత్నం, లింగుసామి, ఇలా ఆల్ మోస్ట్ అంతా తెలుగు హీరోలకి ఫ్లాపులే ఇచ్చారు. అక్కడి సంగీత దర్శకులు ఇక్కడ ఫ్లాపు పాటల్నే తూటాల్లా పేల్చారు.. ఇలాంటి టైంలో అసలే అల్లు అర్జున్ హిట్ కొట్టాక కూడా కష్టకాలంలో ఉంటే, కోలీవుడ్ కి 1000 కోట్ల కలని తీర్చే మొనగాడంటున్నారు… దీని మీదే ట్రోలింగ్ జరుగుతోందంటే, ఇంతో ఆట్లీ మహానుభావుడు, ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం వాడిన విజువల్స్ ని కూడా కాపీ కొట్టాడనే కామెంట్లు పెరిగాయి. అది కూడా హాలీవుడ్ మూవీ డ్యూన్ ని కాపి కొట్టి దొరికిపోయాడంటున్నారు.. ఇంతకి ఏం జరుగుతోంది? ఎనౌన్స్ మెంట్ ఎందుకు ట్రోలింగ్ కి గురౌతోంది?

పుష్ప2 హిట్టైనా, 1800 కోట్ల వసూళ్లు వచ్చినా కాని సంధ్యా థియేటర్స్ ఇన్స్ డెంట్ వల్ల, బన్నీకి సీనే రివర్స్ అయ్యింది. తర్వాత పాన్ ఇండియా దర్శకులెవరు తనకి అందుబాటులో లేనంత బిజీ అవటంతో, త్రివిక్రమ్ కథకి కమిట్ కాలేక, ఆట్లీ చెప్పిన డిమాండ్లకు ఒప్పుకోలేక కొంత కాలం టైం తీసుకున్నాడు.

ప్రజెంట్ ఆట్లీ తోసినిమాకు కమిటై, పాన్ ఇండియా సైంటిఫిక్ ఫిక్షన్ మూవీకి కమిటయ్యాడు. ఇదెంతో కాలంగా ఆట్లీ కన్న కల అని, తన డ్రీమ్ ప్రాజెక్టులో బన్నీ నటిస్తున్నాడని తేల్చాడు. ఆల్రెడీ హాలీవుడ్ స్టూడియోకి వెళ్లి, అక్కడ టెక్నీషియన్స్ తో మాట్లాడిన వీడియోని వదిలి, బన్నీ బర్త్ డే రోజు సర్ ప్రైజ్ చేశాడు

అంతా బానే ఉంది కాని, ఇక్కడ రెండు విషయాలు ట్రోలింగ్ కి గురౌతున్నాయి. ఒకటి ఈ సినిమా వీడియోని వదిలిన టీం వాడిన కొన్ని విజువల్స్, ఇమేజెస్ హాలీవుడ్ మూవీ డ్యూన్ పోస్టర్ ని పోలి ఉన్నాయంటున్నారు. అంతేకాదు ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్ తోనే ఈ సైఫై మూవీ రాబోతోందంటున్నారు. అలసు కథేంటో తేలకముందే, పోస్టర్ ని కాపీ కొట్టారని, కథ ని కాపీ కొడతారంటూ ట్రోలింగ్ పెంచారు

ఇంకో వర్షన్ ఏంటంటే, కోలీవుడ్ కి ఇంతవరకు వెయ్యికోట్ల వసూళ్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు. తెలుగులో బాహుబలి 2, కల్కీ 2, త్రిబుల్ఆర్ సినిమాలకు 1000 కోట్ల పైనే వసూళ్లువచ్చాయి. కన్నడ వాళ్లకి కేజీయఫ్ 2 తో ఆ కోరిక తీరింది. హిందీలో షారుఖ్ పుణ్యమాని పటాన్, జవాన్ తో 1000 కోట్ల కల తీరంది. అయినా అంతకుముందే దంగల్ 2 వేల కోట్ల క్లబ్ లో చేరింది

ఎలా చూసినా వెయ్యికోట్లు రాబట్టిన రికార్డు 3 తెలుగు సినిమాలకు, 3 హిందీ మూవీలకు దక్కితే, శాండిల్ వుడ్ కి కూడా 1000 కోట్ల రికార్డు దక్కింది. ఎటొచ్చి పాన్ ఇండియా హిట్లు లేక, వెయ్యికోట్ల వసూళ్ల మొఖం చూడక కోలీవుడ్ మాత్రమే ఈ నెంబర్ కి దూరంగా మిగిలిపోయింది

సో బాలీవుడ్ కి జవన్ తో 1000 కోట్ల హిట్ ఇచ్చిన ఆట్లీ మేకింగ్ లో బన్నీ సినిమాచేస్తుంటే, అరవోళ్లకి కూడా వెయ్యికోట్ల వరాన్నిచ్చేది తెలుగోడే అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. ఏదేమైనా హాలీవుడ్ మూవీ డ్యూన్ పోస్టర్ కాపీ వల్ల సినిమానే కాపీ అని ఒకరు, తమిళోళ్లకి కూడా వెయ్యికోట్ల కల నెరవేర్చాలంటే కూడా తెలుగోడే రంగంలోకి దిగాలి అంటూ మరొకరు ఇలా రెండు రకాలుగా ఈ ప్రాజెక్టుని ట్రోల్ చేస్తున్నారు.