ఒకే దెబ్బకు 670 కోట్లు.. 1000 కోట్లు… ఉగాది స్పెషల్…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జపాన్ లో దుమ్ముదులిపేస్తున్నాడు. దేవర ప్రమోషన్ ఓరేంజ్ లో జరుగుతున్నాయి. 3 రోజుల్లో 827 యూ ట్యూబ్ ఇంటర్వూస్ అంటే నిజంగా ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2025 | 06:37 PMLast Updated on: Mar 25, 2025 | 6:37 PM

670 Crores In One Go 1000 Crores Ugadi Special

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జపాన్ లో దుమ్ముదులిపేస్తున్నాడు. దేవర ప్రమోషన్ ఓరేంజ్ లో జరుగుతున్నాయి. 3 రోజుల్లో 827 యూ ట్యూబ్ ఇంటర్వూస్ అంటే నిజంగా ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. అన్నీ పది పదిహేను నిమిషాల ఇంటర్వూలేనట. మరో 173 ఇంటర్వూస్ ఇస్తే గిన్నిస్ రికార్డే వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్థుతానికి తనెన్ని ఇంటర్వూలు ఇస్తున్నాడో అది మాత్రమే రివీలైంది. ఈ వీకెండ్ దేవర మూవీ జపాన్ లోరిలీజ్ కాబోతోంది. ముందే అనుకున్నట్టు జపాన్ కి 22 తేదీన తారక్ వెలతాడన్నదే నిజమైంది. ప్రజెంట్ జపాన్ లో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న తారక్, ఉగాదికి బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఒకవైపు దేవర జపన్ లో రిలీజ్ అవుతుంటే, మరో వైపు డ్రాగన్ గా నిప్పులకు కక్కే రిస్క్ కి రెడీ అయ్యాడు. ఇంతకి ఉగాది స్పెషల్ గా ఎన్టీఆర్ ఇస్తున్న డబుల్ బొనాంజా ఏంటి? జపాన్ లో దేవర దరువెలా ఉంది? హావేలుక్

యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఎన్టీఆర్ ని మార్చిన మూవీ దేవర. త్రిబుల్ ఆర్ తోనే గ్లోబల్ స్టార్ గా గుర్తింపు వచ్చినా, ఆడియన్స్ నుంచి అలానే దర్శకుడినుంచి వచ్చిన బిరుదు మాత్రం మ్యాన్ ఆఫ్ ది మాసెస్. అందుకే త్రిబుల్ ఆర్ తో సమానంగా దేవర మూవీ ఎన్టీఆర్ కి చాలా స్పెషల్. దీనికితోడు రాజమౌలి డైరెక్షన్ లోహిట్ పడ్డాక, ఏ హీరకైనా ఫ్లాప్ పడాలనే సెంటిమెంట్ ని దేవరతోనే బ్రేక్ చేశాడు ఎన్టీఆర్..కాబ్టటే దేవర తన కెరీర్ లో సూపర్ స్పెషల్ గా మారింది. ఇప్పుడు జపాన్ ఫ్యాన్స్ కి అంతకంటే స్పెషల్ గా మారుతున్నట్టుంది. ఈనెల 22 నుంచి 28 వరకు జపాన్ లోనే 8 నగరాల్లో ఎన్టీఆర్ దేవర ప్రమోషన్ చేస్తాడన్నారు. 28 సినిమా రిలీజ్ కాబట్టి, అక్కడ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచేస్తాడన్నారు. అచ్చంగా అదే జరుగుతోంది. జపాన్ లో ప్రతీ పావుగంటకో ఇంటర్వూ ఇస్తున్నాడు. కుదిరితే ఒకేసారి 8 మందికి ఇంటర్వూలు ఇస్తున్నాడు. ఒక యూనివర్సిటీసలో 200 కెమెరాలు, 200 మంది యూ ట్యూబర్స్ కి ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వూలు ప్లాన్ చేశాడు.

ఇలాంటి ఇంటర్వూలు హాలీవుడ్ సినిమా టీంలు కూడా ఇప్పటి వరకు జపాన్ లోప్లాన్ చేయలేదు. ఇవ్వలేదు. నిజంగా ఇదో వెరైటీ ప్రమోషన్ అంటున్నారు. అక్కడ మీడియా కూడా త్రిబుల్ ఆర్, బాహుబలి కంటే కూడా కాస్త ఎక్కువే దేవరకి ఫుల్ అటెన్షన్ ఇస్తోంది. నిజంగా రోజుకి 20 ఇంటర్వూలే గొప్ప విషయం అలాంటిది, 3 రోజుల్లో 873 ఇంటర్వూలు ప్లాన్ చేశారంటే నిజంగా షాకింగే..ప్రపంచంలో ఇంతవరకెవ్వరు ఇన్ని నెంబరాఫ్ ఇంటర్వూస్ ఇవ్వకపోవటంతో ఇదో గిన్నిస్ రికార్డుగా మారే ఛాన్స్ ఉంది. కాకపోతే అప్పట్లో అవతార్ టీం మాత్రం ఒక్కో నటుడు, టెక్నీషియన్స్ విడివిడిగా యూరప్ లో 930 ఇంటర్వూలు 3 రోజుల్లో ఇచ్చారు. అలా చూస్తే మరో 118 ఇంటర్వూలను అదనంగా ఎన్టీఆర్ టీం ఇస్తే కనక డెఫినెట్ గా ఇదో గిన్నీస్ రికార్డుగా మారే ఛాన్స్ఉంది. కొరటాల శివ తో పాటు మిగతా టీం కూడా విడి విడిగా ఇంటర్వూలు ఇస్తోంది.

ఆల్రెడీ దేవర మూవీ ప్రివ్యూనే జపాన్ లో 8 లక్షల మందికి పైగా చూశారు. ఇప్పుడు 28ని సినిమానే అక్కడ రిలీజ్ కాబోతోంది. ఆడ లేడీస్ ఏకంగా ఇండియన్స్ స్టైల్లో తారక్ కటౌట్ కి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేశారు. అసలు అక్కడ వైబ్సే మారిపోయాయి. సో ఈ వారం 28 వరకు అక్కడే ఉండా దేవర రిలీజ్ అయ్యాక, ఇండియా బయలు దేరబోతున్నాడు తారక్. ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నాక, డ్రాగన్ సెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఏప్రిల్ 20 తర్వాతే డ్రాగన్ సెట్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ ఇస్తాడన్నారు. కాని ఏప్రిల్ 3 అంటే నెక్ట్స్ వీక్ గురువారం నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ ఎంట్రీ కన్ఫామ్ అయినట్టే..