8 గంటల పెళ్లి.. బ్రామ్మణ సంప్రదాయం… శోభిత, చైతు వింటేజ్ మ్యారేజ్..!

టాలీవుడ్ స్టార్ జంట శోభిత ధూళిపాళ్ళ, నాగ చైతన్య వివాహ వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. ఈ పెళ్లిలో అన్నీ ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోనున్నాయి. అతి తక్కువ మంది అతిధుల సమక్షంలో జరగనున్న ఈ వివాహ తంతు నేటి నుంచి మొదలయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 30, 2024 | 06:26 PMLast Updated on: Nov 30, 2024 | 6:26 PM

8 Hour Wedding Brahmin Tradition Shobhita And Chaitus Vintage Marriage

టాలీవుడ్ స్టార్ జంట శోభిత ధూళిపాళ్ళ, నాగ చైతన్య వివాహ వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. ఈ పెళ్లిలో అన్నీ ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోనున్నాయి. అతి తక్కువ మంది అతిధుల సమక్షంలో జరగనున్న ఈ వివాహ తంతు నేటి నుంచి మొదలయింది. డిసెంబర్ నాలుగున పూర్తి కానుంది. ఇక ఈ పెళ్లిలో అన్నీ స్పెషల్ గానే ప్లాన్ చేసింది అక్కినేని ఫ్యామిలీ. ఈ వివాహం తెలుగు బ్రాహ్మణ సంప్రదాయాలకు అనుగుణంగా జరగనుంది. సాంస్కృతిక విలువలతో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు.

ఈ వివాహ ఆచారాలు ఎనిమిది గంటలకు పైగా జరుగుతాయని అక్కినేని ఫ్యామిలీ తెలిపింది. తెలుగు సాంప్రదాయాలను ఇష్టపడే శోభిత, చైతూ… ఈ పెళ్లి ఏర్పాట్లను తమకు ఏ విధంగా కావాలో దగ్గరుండి చేయించుకున్నారు. తమ పెళ్లిని తాము ఎలా చూడాలి అనుకుంటున్నామో… ఆ విధంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ది బెస్ట్ సెట్ వేయించుకున్నారు. ఇద్దరి పెళ్లి బట్టలు కూడా అత్యంత ప్రత్యేకంగా నిలిచిపోనున్నాయి. శోభిత పెళ్లి చీర, బ్లౌజ్ ను ప్రత్యేకంగా బంగారు వర్ణంతో తయారు చేయించారు.

సాంప్రదాయ కంజీవరం పట్టు చీరలో ఆమె పెళ్లి కూతురుగా ముస్తాబు కానుంది. ఈ చీరను స్పెషల్ గా డిజైన్ చేయించారు. చీర కోసమే దాదాపు 74 లక్షలు ఖర్చు చేసింది అక్కినేని ఫ్యామిలీ. ఆంధ్రప్రదేశ్‌లోని పొందూరులో నేసిన సాధారణ తెల్లటి ఖాదీ చీర కూడా ఈ పెళ్లిలో ఆమె ధరిస్తుందని అక్కినేని ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. చైతన్య కూడా పొందూరు ఖద్దరు దుస్తులనే ధరించానున్నాడు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. శుభలేఖను చాలా స్పెషల్ గా తయారు చేయించారు.

వివాహ శుభలేఖతో పాటుగా… చిన్న బుట్టలో బ్లౌజ్, స్వీట్స్, హాట్ తో పాటుగా వక్క పొడి వంటివి ప్యాక్ చేసి అందించారు. ఇక ఈ ఆహ్వాన పత్రికలో గుడి ఫోటో…, గంటలు, అరటి చెట్లు, ఆవు ఫోటోతో అత్యంత ప్రత్యేకంగా తయారు చేయించారు. పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించిన దగ్గరి నుంచి ప్రతీ ఒక్కటి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని… తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా చేసుకుంటున్నారు. చైతన్య శోభితల పెళ్ళికి సుముహర్తం 4వ తేదీ రాత్రి 8.13 గంటలు. అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతూ తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం జరుగుతుందని అక్కినేని ఫ్యామిలీ వర్గాలు తెలిపాయి. ఈ పెళ్లి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దాదాపు 50 కోట్లకు కొన్నట్టు తెలుస్తోంది. అందుకే పెళ్లి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్లాన్ చేసారు.