నందమూరి హీరోలతో 800 కోట్లు, ఐటీ రైడ్స్ నుంచి నాగ వంశీ ఎస్కేప్

మంగళవారం నుంచి జరిగిన ఐటీ దాడులు దెబ్బకు టాలీవుడ్ చిగురుటాకులా వణికిపోయింది. ఎప్పుడు ఎవరిపై ఐటి అధికారులు దాడులు చేస్తారో నని సినిమా వాళ్ళు గుండె గుప్పిట్లో పెట్టుకుని బతికారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2025 | 09:25 PMLast Updated on: Jan 24, 2025 | 9:25 PM

800 Crore With Nandamuri Heroes Naga Vamsi Escape From It Raids

మంగళవారం నుంచి జరిగిన ఐటీ దాడులు దెబ్బకు టాలీవుడ్ చిగురుటాకులా వణికిపోయింది. ఎప్పుడు ఎవరిపై ఐటి అధికారులు దాడులు చేస్తారో నని సినిమా వాళ్ళు గుండె గుప్పిట్లో పెట్టుకుని బతికారు. ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేసిన నిర్మాతలపై టార్గెట్ చేసి దాడులు చేశారు. మొత్తం 55 బృందాలు ఐటి దాడుల్లో పాల్గొన్నాయి. 15 మంది సినీ ప్రముఖులపై ఎక్కువగా ఐటీ దాడులు జరిగాయి. దిల్ రాజును అలాగే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలను ఎక్కువగా టార్గెట్ చేశారు ఐటీ అధికారులు.

అలాగే మ్యాంగో మీడియాపై కూడా గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఈ దాడుల్లో ఏం బయటపడింది అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మీడియాలో వార్తలు మాత్రం 600 కోట్లకు సంబంధించి మైత్రి మూవీ మేకర్ సరైన లెక్కలు చెప్పలేదు అంటూ ప్రచారం జరిగింది. అది ఎంతవరకు నిజమనేదానిపై తెలీదు. ఇక దిల్ రాజు పైన గట్టిగానే దృష్టిపెట్టారు. ఆయన బ్యాంకు లాకర్లు ఆయన సన్నిహితుల ఇళ్లపై కూడా తనిఖీలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ దాడుల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ మాత్రం తప్పించుకుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలన్నీ దాదాపుగా సూపర్ హిట్ అవుతున్నాయి. దేవరా సినిమా కూడా భారీగానే వసూళ్లు సాధించింది. ఇక రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా కూడా గట్టిగానే కలెక్షన్స్ రాబట్టింది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరా సినిమా 600 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడినట్లు ప్రచారం జరిగింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా 150 కోట్లు పైగానే వసూలు చేసినట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. నాలుగు రోజుల క్రితం దీనిపై ప్రకటన వచ్చింది.

అయితే ఐటీ దాడులు మొదలైన తర్వాత మాత్రం డాకు మహారాజ్ కలెక్షన్స్ విషయంలో మేకర్స్ ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. భారీగా కలెక్షన్స్ రాబట్టిన నిర్మాతలపైనే ఐటీ అధికారులు గట్టి ఫోకస్ చేయడంతో అనౌన్స్మెంట్ విషయంలో నాగవంశీ సైలెంట్ గా ఉండిపోయారు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 190 కోట్ల వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ దానిపై మాత్రం ఎక్కడ ఒక్క ప్రకటన కూడా అధికారికంగా చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. దీనితో ఐటీ అధికారులు కూడా పెద్దగా నాగవంశీ పై ఫోకస్ పెట్టినట్లు కనబడలేదు.

దేవర సినిమా భారీ వసూళ్లు సాధించింది కాబట్టి ఖచ్చితంగా నాగవంశీని టార్గెట్ చేస్తారని అందరూ అంచనా వేశారు. అయినా సరే ఆయన ఐటీ దాడుల నుంచి తప్పించుకున్నారు. తక్కువ బడ్జెట్ తో భారీ లాభాలు కొల్లగొడుతున్న నాగవంశీ ఫ్యూచర్లో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. రిస్క్ తక్కువ ప్రాఫిట్ ఎక్కువ సినిమాలు పైనే నాగ వంశీ ఫోకస్ ఉంటుంది. బహుశా ఆయనపై ఐటి దాడులు జరగపోవడానికి ఇది కూడా ఒక కారణం అనే వార్తలు ఉన్నాయి