85 కోట్ల వెనక తిట్లు, కామెంట్లు, వివాదాలు… కోర్టు కేసులు.. ఫ్లవరా? ఫైరా..?
పుష్ప 2 మూవీ ఈవెంట్ వివాదమైంది. పోలీసులనుంచి విమర్శల దాడి పెరిగినట్టు తెలుస్తోంది. కట్ చేస్తే, టిక్కెట్ ప్రైజ్ మీద కోర్టులో చుక్కెదురైంది. ఏపీ, తెలంగాణలో టిక్కెట్ రేట్ల కక్కుర్తి అంటూ విమర్శల దాడి పెరిగింది. ఆల్రెడీ మెగా హీరోలకి దూరంగా ఉండి, మెగా వైరం పెట్టుకున్న బన్నీ
పుష్ప 2 మూవీ ఈవెంట్ వివాదమైంది. పోలీసులనుంచి విమర్శల దాడి పెరిగినట్టు తెలుస్తోంది. కట్ చేస్తే, టిక్కెట్ ప్రైజ్ మీద కోర్టులో చుక్కెదురైంది. ఏపీ, తెలంగాణలో టిక్కెట్ రేట్ల కక్కుర్తి అంటూ విమర్శల దాడి పెరిగింది. ఆల్రెడీ మెగా హీరోలకి దూరంగా ఉండి, మెగా వైరం పెట్టుకున్న బన్నీ, మాటి మాటికి ఫ్యాన్సంటే పిచ్చంటూ చేసే కూడా మెగా హీరోలని టార్గెట్ చేసే చేస్తున్నాడనంటున్నారు. ఇలాంటి టైంలో పుష్ప 2 ఈవెంట్ మాత్రమే కాదు, టిక్కెట్ ప్రైజ్, వారం రోజుల్లోనే వసూల్లన్ని లాగేయాలన్న కక్కుర్తి మీద కామెంట్ల దాడి పెరిగింది. నిజం చెప్పాలంటే పుష్ప 2 టాక్ ఏమాత్రం ప్రివ్యూలో వీకైనా, ఈ నెగెటివీ మధ్య వైల్డ్ ఫైర్ కాస్త మిస్ ఫైరయ్యేచాన్స్ ఎక్కువ… ఇంతకి పుష్పరాజ్ కి ప్రి రిలీజ్ బిజినెస్ ఎంత గొప్పగా ఉన్నా, ఎందుకు ఇంత నెగెటివిటీ పెరుగుతోంది?
పుష్ప రాజ్ రెండో సారి బాక్సాఫీస్ మీద వేట షురూ చేశాడు. రిలీజ్ కిముందే 1000 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ అన్నారు. అడ్వాన్స్ టిక్కెట్ల రూపంలో ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా 85 కోట్ల వసూల్ల వచ్చినట్టే అనేశారు. కాని కోర్టు కేసులు, కామెంట్ల వివాదాలు, మెగా గ్యాప్ తో పెరిగిన ఇబ్బందులు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి
1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చూసి, ఇక సినిమా విడుదలైన వారంలోపే బ్రేక్ ఈవెన్ రాబట్టేందుకు నిర్మాతలు మరీ అత్యాశకు పోతున్నారనే కామెంట్లు పెరిగాయి. ఇక కిస్కిస్ తోపాటు ఫీలింగ్స్ పాట పేలకపోవటం, బన్నీని, సుకుమార్ ని ఏమనలేక నిర్మాతల మీద మాటల తూటాలు పేల్చిన దేవి అంటూ తన స్పీచ్ ఇలా ఏదో ఒకటి రెండు వారాలుగా పుష్పని వార్తల్లో ఉండేలా చేసింది
ఇవన్నీ సినిమామీద హైప్ పెంచాల్సింది, ఊపు తగ్గిస్తున్నాయి. దీనికి తోడు పుష్ప2 కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లేటు చేశాడని దేవి ప్లేస్ లో తమన్, అండ్ కో ని తీసుకున్నారన్నారు. కాని ఫైనల్ గా ఎవరి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని ఫిక్స్ చేశారో తేల్చలేదు.
ఇక ఇండస్ట్రీలో టాక్ ప్రకారం చూస్తుంటే, పుష్ప2 క్లైమాక్స్ బన్నకి ఏమాత్రం నచ్చలేదని, మూడు వర్షన్స్ ని సుకుమార్ రాస్తే, అందులో మొదటి వర్షన్ కే డైరెక్టర్స్ టీం ఓకే చేసిందని, అదే తీశారని తెలుస్తోంది. కాని బన్నీ మాత్రం 3 వర్షనే కావాలని పట్టు పట్టి ఆమధ్య షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా పుష్ప2 కి టీజర్, ట్రైలర్ కి వస్తున్న టాక్ మాత్రమే పాజిటివ్ గా ఉంది. కాని మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ సినిమా మీద నెగెటివిటే పెరుగుతోంది
ఆల్రెడీ టిక్కెట్ రేటు ఎబ్ నార్మల్ గా పెంచటంతో కోర్టుని కొందరు అప్రోచ్ అయ్యారు. ఇలా అన్నీ వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. విచిత్రం ఏంటంటే, పుష్ప2 ఫైనల్ ఔట్ పుట్ నిర్మాతలకే డౌట్లు క్రియేట్ చేయటంతో, టాక్ వీకయ్యేలోపే వసూళ్ళు రాబట్టేందుకే ఇలా చేస్తున్నారంటూ, యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ కూడా పెరిగింది. మరి ఏది నిజమో, ఏం జరుగుతుందో తేలాలంటే, ప్రివ్యూ టాక్ తోనే తేలుతుంది. కొన్ని గంటల్లో పుష్ప రాజ్ ఫైరా, వైల్డ్ ఫైరా అనే కాదు, కాలం వెక్కిరిస్తే ఫ్లవరో కాదో కూడా తేలుతుంది.