90 రోజుల కాల్ షీట్స్ కి… 50 రోజుల డెడ్ లైన్…
సందీప్ రెడ్డి వంగ కి రెబల్ స్టార్ ప్రభాస్ అభయ హస్తం ఇచ్చాడు. ఎప్పుడో జనవరిలో మొదలవ్వాల్సిన స్పిరిట్ ఇంకా మొదలు కాలేదు. జూన్ లోగా ఫౌజీ షూటింగ్ పూర్తవుతుందనుకుంటే, ఆగస్ట్ వరకు షూటింగ్ కొనసాగేలా ఉంది.

సందీప్ రెడ్డి వంగ కి రెబల్ స్టార్ ప్రభాస్ అభయ హస్తం ఇచ్చాడు. ఎప్పుడో జనవరిలో మొదలవ్వాల్సిన స్పిరిట్ ఇంకా మొదలు కాలేదు. జూన్ లోగా ఫౌజీ షూటింగ్ పూర్తవుతుందనుకుంటే, ఆగస్ట్ వరకు షూటింగ్ కొనసాగేలా ఉంది. ఈలోపు ప్రభాస్ కి మోకాలి నొప్పి మళ్లీ తిరగ తోడటంతో, స్పిరిట్ షూటింగ్ కాదు, లాంచింగే లేట్ అయ్యేలా ఉంది. ఇక్కడే తనకి డౌట్ వచ్చే ఈలోపు మరో ప్రాజెక్టు కోసం ఎన్టీఆర్ ని కలిశాడు సందీప్ రెడ్డి వంగ… వాళ్ళ మధ్య కథా చర్ఛలు జరిగిన మాట వాస్తవమే అయినా, ఎట్టి పరిస్థితుల్లో స్పిరిట్ ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం సందీప్ రెడ్డి కి ఉంది. రణ్ బీర్ కపూర్ నుంచి తనకి ప్రెజర్ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి టైంలో 90 రోజుల కాల్ షీట్స్ ఇచ్చేశాడు ప్రభాస్. కాని ఆ కాల్ షీట్స్ ని వాడేందుకు టైం దగ్గర పడుతోంది. మరో 50 రోజుల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలవ్వాలి. మరి అవుతుందా? రెబల్ స్టార్ ఇంతకి సందీప్ రెడ్డికి ఏమని మాటిచ్చాడు..? కంగారుని తగ్గించేందుకు ఇంకేం చేశాడు?
రెబల్ స్టార్ తో సందీప్ రెడ్డి సినిమాకు డెడ్ లైన్ వచ్చేసింది. సందీప్ కి ప్రభాస్ ఇచ్చిన మాట ప్రకారం జులై ఫస్ట్ కి స్పిరిట్ షూటింగ్ మొదలవ్వాలి. అంటే ఇంకా ఎగ్జాక్ట్ గా 50 రోజుల గడువే ఉంది. ఆల్రెడీ కథ ఎప్పుడో సిద్దమైంది. మెక్సీకోలో లొకేషన్ల వేట కూడా పూర్తి చేసిన సందీప్ రెడ్డి వంగ, స్పిరిట్ కోసం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని కూడా పూర్తి చేయించాడు
అసలే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ విషయంలో రణ్ బీర్ కపూర్ నుంచి సందీప్ కి ప్రెజర్ ఉంది. తను రామయాణం మూడు భాగాల్లో మొదటి భాగం పూర్తి చేశాక, యానమిల్ పార్క్ చేయాలనుకుంటున్నాడట. అలాజరగాలంటే, స్పిరిట్ ఎట్టి పరిస్తితుల్లో జులైలో మొదలవ్వాలి… అక్కడే సవాలక్షా డౌట్లున్నాయి
అసలే ది రాజా సాబ్ సాంగ్స్ తోపాటు ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. గ్రాఫిక్స్ వర్క్ డిలే అవటం, బడ్జెట్ సమస్యలతో ఫినిషింగ్ టచ్ సాధ్యం కావట్లేదు. దీనికి తోడు ఫౌజీ షూటింగ్ అయినా బాగా జరుగుతోందంటే, ఈలోపు ప్రభాస్ కి మోకాలి గాయం మళ్లీ తిరగతోడిందంటున్నారు.
అందుకే సేఫ్ సైడ్ కోసం ఎన్టీఆర్ ప్రాజెక్టుని కూడా ప్లాన్ చేశాడు కాబట్టే, తనని సందీప్ రెడ్డి వంగ మూడో సారి కలిసి కథా చర్చలు చేశాడట. ఇలాంటి టైంలో ప్రభాసే పిలిచి రెండు నెలలు ఆగమని సందీప్ కి భరోసా ఇచ్చాడట. ఎట్టి పరిస్థితుల్లో జులై ఫస్ట్ కి స్పిరిట్ షూటింగ్ పక్కా అని తేల్చాడట
90 రోజులు గ్యాప్ లేకుండా మూడు షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్న సందీప్, జులై నెలలో 25 రోజులు, సెప్టెంబర్, నుంచి డిసెంబర్ మధ్య మిగతా 65 రోజుల్లో 80శాతం టాకీ పార్ట్ పూర్తి చేస్తాడట. మొదటి షెడ్యూల్లో యాక్షన్ పార్ట్ తీసి, ఆతర్వాతే టాకీ పార్ట్ కి మూవ్ అవుతాడని తెలుస్తోంది. ఫస్ట్ టైం పోలీస్ పాత్ర వేయబోబోతున్న ప్రభాస్, సందీప్ కి ఇచ్చిన మాట ప్రకారం, తన లుక్ కూడా మార్చుకుంటాడని తెలుస్తోంది. కాని ఇదంతా రెండు నెలల్లో ఎలా సాధ్యమో మాత్రం ఎవరికీ అర్ధకాని విషయం..