900 కోట్ల క్లబ్ కి దగ్గరలో దేవర… ఎనౌన్స్ మెంట్ ఏది..?

దేవర ప్రివ్యూపరీక్షను గెలిచింది. ఓవరర్ సీస్ లో సునామీ తెచ్చింది.నార్త్ ఇండియాలో అయితే ఏకంగా మాస్ మతిపోగొట్టింది. మొత్తంగా ఈ సినిమా 13 రోజుల్లో ఏకంగా 850 కోట్లు రాబట్టాయి.అంటే ఆల్ మోస్ట్ దేవర దెబ్బకి 800 కోట్ల క్లబ్ లో వసూళ్ల వరద పేరుకున్నతట్టే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 13, 2024 | 12:47 PMLast Updated on: Oct 13, 2024 | 12:47 PM

900 Crores Club Is Close To Devara What Is The Announcement

దేవర ప్రివ్యూపరీక్షను గెలిచింది. ఓవరర్ సీస్ లో సునామీ తెచ్చింది.నార్త్ ఇండియాలో అయితే ఏకంగా మాస్ మతిపోగొట్టింది. మొత్తంగా ఈ సినిమా 13 రోజుల్లో ఏకంగా 850 కోట్లు రాబట్టాయి.అంటే ఆల్ మోస్ట్ దేవర దెబ్బకి 800 కోట్ల క్లబ్ లో వసూళ్ల వరద పేరుకున్నతట్టే. గురువారం రెండు షోలతో 900 కోట్ల క్లబ్ లో దేవర చేరటం పక్కా అయ్యింది. అయినా ఎక్కడ కూడా 500 కోట్ల క్లబ్ తాలూకు ఎనౌన్స్ మెంట్ కనిపించలేదు. 600 కోట్లు, 700, 800 కోట్లు అంటూ వసూళ్లు వరద ఎక్కువైనా ఫిల్మ్ టీం రెస్పాన్స్ లేదు. ఎలాంటి స్పెషల్ పోస్టర్ ద్వారా ఎనౌన్స్ చేసింది లేదు. మామూలుగా ప్రతీ 100 కోట్లు వసూళ్లొచ్చిన ప్రతీ సారి ఓ పోస్టర్ రావాల్సింది.. కాని అలాంటి ప్రయత్నాలు లేకుండా దేవర టీం ఎందుకు సైలెంట్ గా ఉంటోంది?

దేవర మూవీ 900 కోట్ల క్లబ్ లో చేరేందుకు 50కోట్ల దూరంలో ఉంది. గురువారం వసూళ్లు కలిపితే, 900 కోట్ల క్లబ్ లోచేరినట్టే. అంతే శుక్రవారం, వసూళ్లు, శనివారం మొదటి రెండు ఆటల వసూళ్లని కూడా అంచనావేసి కలిపితే 1000 కోట్ల క్లబ్ లో దేవర 16వ రోజు అడుగు పెట్టేలా ఉన్నాడు. అదే జరిగితే ఇదో పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయినట్టే. ఎందుకంటే హిందీలో దంగల్, షారుఖ్ ఖాన్ మూవీ పటాన్, జవాన్ కూడా 40 రోజుల తర్వాతే 1000 కోట్ల క్లబ్ లో చేరాయి.

సో థౌజెండ్ వాలా అనిపించుకునేందుకు దంగల్, పటాన్, జవాన్ కి 40 రోజులు పడితే, బాహుబలి 2, త్రిబుల్ ఆర్ మూవీలకు 28 రోజుల టైం పట్టింది. ఇక కల్కీ కి 22 రోజుల టైం పట్టింది. కాని 16 రోజుల్లోనే దేవర 1000 కోట్ల వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసేలా ఉంది.

విడుదల రోజు 172 కోట్ల వసూళ్లు వచ్చినా కాని, నెగెటీవ్ టాక్, నెగెటీవ్ రివ్యూస్ వచ్చాక కూడా ఓ మూవీకి పాన్ ఇండియా లెవల్లో 16 రోజుల్లోనే 1000 కోట్ల వసూళ్లొచ్చాయంటే, రజినీకాంత్, రేంజ్ దాటిన ప్రభాస్ లానే, పాన్ ఇండియా సెకండ్ కింగ్ గా తారక్ పేరు మారుమోగే ఛాన్స్ ఉంది

అచ్చంగా ఇలానే జరుగుతోంది.దేవర విడుదలైన 6 రోజుల్లో 400 కోట్లొచ్చాయి. 8 రోజుల్లో 680 కోట్లు దాటాయి. ఇక 11 రోజుల్లో 730 కోట్లు వస్తే కేవలం 466 కోట్ల నెట్ వసూళ్లు తప్ప గ్రాస్ కలెక్షన్స్ ని ఫిల్మ్ టీం ఎనౌన్స్ చేయలేదు. మళ్లీ మరో పోస్టర్ ఇంతవరకు రాలేదు. దానికి ఒకటే కారణం, ఎన్టీఆరే ఈ సినిమా వసూళ్లు 1000 కోట్లు దాటే వరకు ఎనౌైన్స్ మెంట్ వద్దన్నాడట.

శనివారం రెండో ఆట వసూళ్లతో కలుపుకుని దేవర 1000 కోట్ల క్లబ్ లో చేరటం ఖాయమైంది. ఆల్రెడీ ఈ సినిమా బుధవారం వరకు వచ్చిన వసూళ్లతో 850 కోట్ల మార్క్ దాటింది. మరో 150 కోట్లు, కేవలం 8 షోలతో రాబట్టే ఛాన్స్ ఉంది. ఆ లెక్కనే దసరా రోజు 1000 కోట్ల నెంబర్ ని రీచ్ కాగానే, ఆయుద పూజ పాటని యానిమేషన్ లో సరికొత్తగా వసూళ్ల లెక్కలతో రీలీజ్ చేస్తారట.

అలా దేవర టీం దసరా అంటేనే ఆయుధ పూజ కాబట్టి, ఆరోజు దేవర మొత్తం ఏ ఏ రోజు ఎంత కలెక్ట్ చేసిందో ఆలెక్కల్ని బాహుబలి 2 లో ముందు వచ్చే యానిమేటెడ్ సాంగ్ స్టైల్లో, ఆయుధపూజ పాట ఆడియో కలిపి రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ పనులు కూడా పూర్తయ్యాయి. వన్స్ శనివారం మ్యాట్నీ వసూళ్ల లెక్కలతో 1000 కోట్ల క్లబ్ లో సినిమా అడుగు పెడితే చాలు, నైట్ లోగా సాంగ్ రిలీజ్ అవుతుందట.