పుష్ప పిచ్చోళ్ళు, ప్రాణం తీసుకున్నారు
ఇండియన్ సినిమాలో మోస్ట్ వెయిటెడ్ మూవీ పుష్పా 2 గ్రాండ్ గా రిలీజ్ అయింది. గురువారం సాయంత్రం నుంచే బెనిఫిట్ షోలు స్టార్ట్ చేశారు పుష్ప మేకర్స్. దీనికి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.
ఇండియన్ సినిమాలో మోస్ట్ వెయిటెడ్ మూవీ పుష్పా 2 గ్రాండ్ గా రిలీజ్ అయింది. గురువారం సాయంత్రం నుంచే బెనిఫిట్ షోలు స్టార్ట్ చేశారు పుష్ప మేకర్స్. దీనికి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు హైదరాబాదులోని సంధ్య 70mm థియేటర్ కు కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తానని అల్లు అర్జున్ ప్రకటించడంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని తమ అభిమాన హీరోకు ఘన స్వాగతం పలికారు.
సినిమా కోసం మూడు ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అభిమానులకు అల్లు అర్జున్ రాకతో ఒక రకంగా పండగ వాతావరణం నెలకొంది. దీనితో ఫామిలీ ఆడియన్స్ కూడా సినిమా కోసం భారీగా తరలివచ్చారు. సాధారణంగా బెనిఫిట్ షోలకు మహిళలు రావడం అరుదు. కానీ ఈ సినిమాకు మాత్రం పెద్ద ఎత్తున మహిళలు కూడా రావడం గమనార్హం. అయితే అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో పోలీసులు అభిమానులను కట్టడి చేయడం సమస్యగా మారింది. దీనితో అక్కడ స్వల్ప తొక్కిసలాట లాంటి చోటుచేసుకుంది.
ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒక చిన్నారిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అభిమానుల్లో సినిమాపై క్రేజ్ ఉందన్న విషయం తెలిసినా కూడా అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ కోసం ఈ విధంగా రావడం పట్ల ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పుష్ప 2 సినిమాను వివాదాలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అల్లు అర్జున్ రావడం ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం అలాగే ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడం మరో చిన్నారి ఆసుపత్రి పాలు కావడంతో అల్లు అర్జున్ పై సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
మరి ఆ చిన్నారులను అలాగే మరణించిన మహిళ కుటుంబాన్ని అల్లు అర్జున్ ఏ విధంగా ఆదుకుంటాడు… అలాగే పుష్ప మూవీ మేకర్స్ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచేసి అభిమానుల నుంచి వసూలు చేస్తున్నారు. మరి ఆ కుటుంబాలకు ఏ విధంగా సాయం చేస్తారు అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఏది ఏమైనా ఇటువంటి పరిస్థితుల్లో స్టార్ హీరోలు బయటకు రావడం అనేది ఖచ్చితంగా అభిమానుల ప్రాణాలు మీదకు తెచ్చేదే అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. హీరోకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు బౌన్సర్లు ఉండటంతో హీరోకు భద్రత ఉంటుంది. మరి అభిమానుల పరిస్థితి ఏంటి అని… ఒక స్టార్ హీరో సినిమా అంటే సామాన్య ప్రజల్లో కూడా ఒక రకమైన ఆసక్తి ఉంటుందని అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఆ విషయం అర్థం చేసుకోకుండా ఇలా రావడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.