mokshagna : అఖండ 2 లో మోక్షజ్ఞ స్పెషల్ రోల్
నందమూరి అభిమానులకి ఒక గుడ్ న్యూస్.ఇప్పుడు చెప్పబోయే వార్త నిజమైతే కనుక మీ ఐస్ ఐ ఫీస్ట్ కి నోచుకున్నట్టే. అదేంటంటే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.

A good news for the fans of Nandamuri. If the news that is going to be told is true, then it will be your ice eye feast.
నందమూరి అభిమానులకి ఒక గుడ్ న్యూస్.ఇప్పుడు చెప్పబోయే వార్త నిజమైతే కనుక మీ ఐస్ ఐ ఫీస్ట్ కి నోచుకున్నట్టే. అదేంటంటే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ. నిజానికి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. బాలయ్య కూడా తన కొడుకు ఎంట్రీ ఈ ఏడాదే ఉంటుందని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ ముహూర్తం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక తాజా వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
బాలయ్య, బోయపాటి కాంబోలో 2021 లో వచ్చిన మూవీ అఖండ. అఖండ భారతావని సాక్షిగా సూపర్ డూపర్ సక్సెస్ కొట్టింది. దీనికి సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతుంది.రీసెంట్ గా అధికార ప్రకటన కూడా వచ్చింది. అగస్ట్ లో పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసి సెప్టెంబర్ లో షూట్ కి వెళ్లనుందనే వార్తలు వస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం తన 109 వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత అఖండ 2 లో జాయిన్ అవుతాడు. ఇప్పుడు ఇందులోనే మోక్షజ్ఞ ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మోక్షజ్ఞ కోసం బోయపాటి ఒక అద్భుతమైన క్యారక్టర్ రాసాడని, సెకండ్ హాఫ్ లో మోక్షజ్ఞ క్యారక్టర్ వస్తుందని అంటున్నారు. ఇంకాస్త ముందుకేసి టెస్ట్ షూట్ జరిగిందనే పుకారు కూడా చాలా వేగంగానే సర్క్యులేట్ అవుతుంది.
ఇక ఈ వార్తలని ఒట్టి పుకారని కొట్టి పడేయడానికి కూడా వీలులేదు. ఎందుకంటే నందమూరి వారి గత చరిత్రని ఒక్కసారి చూసుకుంటే. తెలుగు వారి కీర్తిని విశ్వ వ్యాప్తం చేసిన కీర్తి శేషులు నందమూరి తారకరామారావు గారు తన నట వారసుడు బాలకృష్ణ ని సోలో హీరోగా పరిచయం చేసే ముందు, తన సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో కనపడేలా చేసారు. ఇప్పుడు తన తండ్రి ఆనవాయితీని బాలకృష్ణ తన కొడుకు విషయంలో కొనసాగించవచ్చు. పూర్తి శైవత్వం తో సాగే అఖండ 2 లో ఒకే స్క్రీన్ పై తండ్రి కొడుకులని చూసి నూటికి నూరు శాతం నందమూరి అభిమానుల ఐస్… ఐ ఫీస్ట్ కి నోచుకున్నట్టే.