బలుపుకి బ్రాండ్ అంబాసిడర్.. అంతమాటంటావా.. ఆమీర్ ఫైర్..
బాలీవుడ్ లో సినిమాలెలా తీయాలో తెలియని బ్యాచ్, బలుపుతో సౌత్ సినిమాను తిట్టడం కామనైపోయింది. వాళ్లేతో ఐన్ స్టీన్ అమ్మమొగుల్లైనట్టు, న్యూటన్ దోస్తులైనట్టు తెగ ఫీలైపోతున్నారు.

బాలీవుడ్ లో సినిమాలెలా తీయాలో తెలియని బ్యాచ్, బలుపుతో సౌత్ సినిమాను తిట్టడం కామనైపోయింది. వాళ్లేతో ఐన్ స్టీన్ అమ్మమొగుల్లైనట్టు, న్యూటన్ దోస్తులైనట్టు తెగ ఫీలైపోతున్నారు. పదేళ్లకో హిట్ కొట్టలేకపోతున్న వాళ్లు, ఇంతవరకు పాన్ ఇండియా హిట్ ని సొంతం చేసుకోలేని వాళ్లు, దిక్కుమాలిన మూవీలు తీస్తూ సొంత ఆడియన్స్ ని తిట్టేటోళ్లు, సౌత్ కి సలహాలిస్తున్నారా… బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఎక్స్ వైఫ్ కిరణ్ రావు సౌత్ వాళ్లకి సినిమాలే తీయరాదన్నట్టు, కొంతమంది కోసమే మనోళ్లు మూవీలు తీస్తారన్న మాట వివాదంగా మారింది. సోషల్ మీడియాలో గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు సౌత్ బ్యాచ్. మొన్నటి వరకు తెలుగు బ్యాచే కౌంటర్స్ ఇచ్చేవాళ్ళు.. ఇప్పుడు తమిళొల్లు రంగంలోకి దిగారు… మొన్నటి వరకు సందీప్ రెడ్డి వంగనే ఒక్కో బాలీవుడ్ క్రిటిక్ కి, బాలీవుడ్ దర్శక నిర్మాతలకి ఇచ్చిపడేశాడు. అయినా బుద్ది రాలేదు. వాళ్లేదో అద్భుతాలు తీస్తుంటే, సౌత్ సినిమా నుంచి లో క్లాస్ మూవీస్ వస్తున్నట్టు కామెంట్ చేసింది. ఇదే ఇప్పుడు దుమారం రేపింది… మళ్లీ సందీప్ రెడ్డి రంగంలో దిగేలా ఉన్నాడు. కాని అంతకుమించిన బ్యాచే సోషల్ మీడియాలో ఆమిర్ ఖాన్ ఎక్స్ వైఫ్ ని ఉతికేస్తోంది… ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ అయితే పూనకాలొచ్చినట్టే విరుచుకుపడుతున్నారు… అదేంటో చూసేయండి.
బాలీవుడ్ ఏం చేస్తే మారుతుందో అక్కడి జనాలకే అర్ధం కావట్లేదు. అందుకే సందీప్ రెడ్డి వంగ, ఆట్లిని తీసుకుని సినిమాలు చేసి హిట్ మెట్లెక్కారు. వెయ్యికోట్ల వసూల్లు రాబ్టటిన సినిమాలు అక్కడ మూడు ఉన్నా, పాన్ ఇండియా లెవల్లో వాళ్లకి సింగిల్ హిట్ పడట్లేదు. దీంతో ఫ్రష్ట్రేషన్ పెరిగిందో, మొన్నటి వరకు లెక్క చేయని సౌత్ సినిమాలు, ఉత్తరాదిని ఊపుతుంటే, అసూయ పెరిగిందో, మొత్తానికి వాళ్ల కుల్లు బయట పడుతోంది.ఆమిర్ ఖాన్ ని పెల్లి చేసుకోకపోతే కిరణ్ రావు అనే ఓ డైరెక్టర్ ఎవరికీ తెలిసేది కాదు. తను ప్రజెంట్ ఆమిర్ ఎక్స్ వైఫ్ అవటం వల్ల వచ్చిన గుర్తింపేలేకపోతే తనో అనామకురాలు. అలాంటి తను సౌత్ సినిమా వాళ్లు కొందరికోసమే సినిమా తీస్తున్నారు, బాలీవుడ్ మాత్రం యూనివర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీస్ తీస్తోందంటోంది.
కేవలం అనామకురాలైనంత మాత్రాన సినిమా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడొద్దా అనే డౌట్ అక్కర్లేదు. ఎవరైనా మాట్లాడొచ్చు . కాని సౌత్ సినిమా స్థాయిని నిర్ణయించాలంటే కిరణ్ రావుకున్న స్థాయేంటనే ప్రశ్న ఎదురౌతుంది. 51 ఏళ్ల వయసున్న కిరణ్ రావు కెరీర్ లోతీసిని 2 సినిమాలు.. ఒకటి 2011 లో వచ్చింది.ఇంకొకటి లాస్ట్ ఇయర్ వచ్చింది. అంటే ఒక్క సినిమా తీయటానికి కనీసం 13 ఏళ్ల టైం తీసుకుంది. అంత కష్టపడి ఏదో అద్భుతమైన మూవీలు తీసిందా అంటే, షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ, ఓటీటీ కి తక్కువ లాంటి మూవీలే తీసింది. చేతిలో పెద్ద బ్యానర్లు, మాజీ భర్త తో ఉన్న కమ్యునికేషన్ తో రెడీ మేడ్ గా సినిమా ఆఫర్స్.. ఇవన్నీ ఉండి కూడా కడుపునిండినోడు కాలీగ కబుర్లు చెప్పినట్టు, సోది చెబుతోంది.
గతంలో తనకే సందీప్ రెడ్డి వంగ గట్టిగా ఇచ్చిపడేశాడు. టుంబ్రీ బ్యాచ్ కూడా తన సినిమాను కామెంట్ చేస్తోందని మంచిగానే ఇచ్చిపడేశాడు. అమీర్ ఖాన్ లాంటి వ్యక్తి ఆడియన్స్ కి దూరంగా, వాళ్లతో సంబంధం లేకుండా హిందీ సినిమాలొస్తున్నాయంటే, కిరణ్ రావు మాత్రం రియాలిటీకి దూరంగా మాట్లాడుతోంది.సౌత్ సినిమాను మెచ్చుకున్న బాలీవుడ్ లిరిసిస్ట్ జావెద్ అక్తర్ కూడా మొన్నటికి మొన్న, ముక్కుం మొఖం తెలియనోళ్లు వచ్చి బాలీవుడ్ ని ఏలుతున్నాడన్నాడనే మాట ప్రచారమైంది. వివాదమైంది. వీటన్నీంటికి నిదానంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ వరకు అంతా విరుచుకుపడుతున్నారు. ట్రోలింగ్ మీమ్స్ తో చుక్కలు చూపిస్తున్నారు.