స్టార్ హీరోపై నాన్ బెయిలబుల్ కేస్, రియాక్షన్ ఇదే
హేమ కమిటీ రిపోర్ట్... ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాతో పాటుగా బాలీవుడ్ ని సైతం షేక్ చేస్తోంది. అవకాశాలు ఇప్పిస్తామని కొందరు స్టార్ హీరోలు నిర్మాతలు హీరోయిన్లను ఇతర నటీ నటులను వేదిస్తున్నారనే ఆరోపణల నేపధ్యంలో బయటకు వచ్చిన ఈ రిపోర్ట్ ప్రకంపనలకు వేదిక అవుతోంది.
హేమ కమిటీ రిపోర్ట్… ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాతో పాటుగా బాలీవుడ్ ని సైతం షేక్ చేస్తోంది. అవకాశాలు ఇప్పిస్తామని కొందరు స్టార్ హీరోలు నిర్మాతలు హీరోయిన్లను ఇతర నటీ నటులను వేదిస్తున్నారనే ఆరోపణల నేపధ్యంలో బయటకు వచ్చిన ఈ రిపోర్ట్ ప్రకంపనలకు వేదిక అవుతోంది. దీనిపై పలువురు సీనియర్ నటులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మాజీ హీరోయిన్ రాధిక కూడా దీనిపై స్పందిస్తూ తనకు ఎదురైన ఒక అనుభవాన్ని వెల్లడించారు. కారవాన్ లో కెమెరాలు పెట్టారు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు.
కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మూవీ యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ రాజీనామా కూడా చేసారు. ఆయనతో పాటు మిగిలిన సభ్యులు సైతం రాజీనామా చేయడం దుమారం రేపింది. ఈ తరుణంలో ఒక వార్త ఇప్పుడు అక్కడ షేక్ చేస్తోంది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తా అని చెప్పి గత ఏడాది నవంబర్ లో ఒక నటిని ప్రేమం సినిమా హీరో నివిన్ పౌలీ… దుబాయ్ తీసుకు వెళ్లారట. అక్కడే ఆమెను లైంగికంగా వేధించారు అని సదరు నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ కేసుపై ప్రాధమిక విచారణ జరిపారు.
ఆ తర్వాత నివిన్ పౌలీ సహా ఆరుగురిపై కేసులు నమోదు చేసారు. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులే. ఇప్పుడు ఈ విషయం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఇంకెంత మంది అక్కడ ఇలాంటి పనులు చేసి ఉంటారనేది చర్చనీయంశంగా మారింది. ఈ కేసులో ఒక నిర్మాత కూడా ఉన్నారు. దీనిపై స్పందించిన నివిన్… ఓ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టా అనే వార్తలు వస్తున్నాయి… వాటిలో ఏ మాత్రం నిజం లేదు. నాపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తున్నా… ఈ విషయం మీద న్యాయపరంగా పోరాటం చేస్తా అంటూ నివిన్ పౌలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.