Animal’s beauty, Vijay Deverakonda : యానిమల్’ బ్యూటీతో రౌడీ రొమాన్స్?
ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నాడు రౌడీ హీరో (Rowdy Hero) విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). గీత గోవిందం (Geeta Govindam) కాంబినేషన్ రిపీట్ చేస్తూ పరుశురాం, విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడంతో.. ఫ్యామిలీ స్టార్ (Family Star) పై అంచనాలు భారీగా ఉన్నాయి.

A rowdy romance with Animal's beauty?
ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నాడు రౌడీ హీరో (Rowdy Hero) విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). గీత గోవిందం (Geeta Govindam) కాంబినేషన్ రిపీట్ చేస్తూ పరుశురాం, విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడంతో.. ఫ్యామిలీ స్టార్ (Family Star) పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur) హీరోయిన్‌గా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్. వాస్తవానికైతే ఫ్యామిలీ స్టార్ కంటే ముందే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.
కొన్ని అనుకొని కారణాల వల్ల వెనక్కి వెళ్లింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను ఓకె చేశారు. కానీ షూటింగ్ డిలే అవడంతో శ్రీలీల తప్పుకున్నట్టుగా టాక్ నడుస్తోంది. దీంతో మరో హీరోయిన్‌ను ఫైనల్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో అనిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అనిమల్ సినిమాలో తృప్తిని చూసిన తర్వాత.. అమ్మడి అందానికి హీరోలు కూడా ఫిదా అయిపోయారు. ఏకంగా ప్రభాస్ ‘స్పిరిట్’లోను అమ్మడు ఛాన్స్ అందుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అంతకంటే ముందే.. తృప్తితో రౌడీ రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
దాదాపు ఈ హాట్ బ్యూటీని గౌతమ్, విజయ్ ప్రాజెక్ట్‌లో ఫైనల్ చేశారని తెలుస్తోంది. తృప్తి డిమ్రితో పాటు ‘సప్త సాగరాలు దాటి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రుక్మిణి వసంత్ పేరును కూడా చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. మార్చి నుంచి ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.