Salaar : సలార్ రూమర్ నిజమైతే..? ( సలార్ )
ఇక్కడ ప్రశాంత్ నీల్ తో హొంబలే సంస్థలు చిన్న పాటి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట. కాబట్టే సలార్ క్లైమాక్స్ ని రీషూట్ చేయాల్సి వస్తోందనే ప్రచారం పెరిగింది. ఇదే ప్రభాస్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ అయితే, కల్కీ టీం బ్రేకింగ్ న్యూస్ రెడీ చేసింది. ఈనెల 10 నుంచి కల్కీ పెండింగ్ షూటింగ్ కి ప్రిపేర్ అవుతోంది. ప్రభాస్ లేని సీన్లు షూటింగ్ చేయబోతున్నారట. కమల్ హాసన్ తాలూకు సీన్స్ షూటింగ్ ని 20 రోజులు ప్లాన్ చేశారట. కానీ ప్రభాస్ మాత్రం జనవరిలోనే షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఇది గుడ్ న్యూసే అయినా సలార్ న్యూసే పరేషాన్ చేసేలా ఉంది.

A rumor about Salaar movie is really confusing the fans How will it be if Salaar is released as a single part
సలార్ విషయంలో భయపెడుతున్న రూమర్స్..
సలార్ మూవీ మీద ఓ రూమర్ నిజంగా ఫ్యాన్స్ ని కంగారు పెట్టించేలా ఉంది. అదే రెండు భాగాలనుకున్న సలార్ ని ఒక భాగంగానే రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది.. ఇది నిర్మాత ఆలోచన. కారణం రెండో భాగం ఇప్పట్లో తెరకెక్కే చాన్స్ లేదు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ మళ్లీ కలిసి సినిమా చేయాలంటే, ఆల్రెడీ కమిటైన మూవీలు వాల్లు పూర్తి చేయాలి.. సో అవన్నీ అయ్యే సరకికి కనీసం 3 ఏళ్లు పడుతుంది.
రెండు భాగాల ఆలోచన అటకెక్కనుందా..?
అంతవరకు సలార్ 2 కోసం ఆల్రెడీ షూట్ చేసిన కంటెంట్ ని ఉంచటం కంటే, సలార్ వన్ తోనే ఆ ఫుటేజ్ ని కలిపి ఎలా ఉంటుందని నిర్మాత ఆలోచిస్తున్నాడట. ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయట. దానర్ధం రెండో భాగం ఉండదని కాదు, కావాలంటే కొత్త గా అప్పడుు రాసుకుని తీసుకోవచ్చు కాని, రెండో భాగం కోసం విడకొట్టిన కథని, దాని కోసం షూట్ చేసిన కొంత భాగాన్ని మొదటి భాగానికే లింక్ చేయాలనేది నిర్మాత పట్టుదల.
కల్కీ షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టేది అప్పుడేనా..?