రెబల్ మహా రాజా వస్తున్నాడు… 1000 కోట్ల టీజ్ చేస్తాడా..?
రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ రెడీ అవుతోంది. ది రాజా సాబ్ టీం భారీ గిఫ్ట్ ని రెడీ చేసింది. మరే మూవీ తాలూకు అప్ డేట్, ది రాజా సాబ్ గిఫ్ట్ ని, దాని ఇంపాక్ట్ ని తగ్గించకుండా ఉండేందుకు, రెడీ అయినా ఫౌజీ సర్ ప్రైజ్ కి బ్రేక్ వేశారు. స్పిరిట్ తాలూకు సాలిడ్ ఎనౌన్స్ మెంట్ ని కూడా సంక్రాంతికి మార్చారు.

రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ రెడీ అవుతోంది. ది రాజా సాబ్ టీం భారీ గిఫ్ట్ ని రెడీ చేసింది. మరే మూవీ తాలూకు అప్ డేట్, ది రాజా సాబ్ గిఫ్ట్ ని, దాని ఇంపాక్ట్ ని తగ్గించకుండా ఉండేందుకు, రెడీ అయినా ఫౌజీ సర్ ప్రైజ్ కి బ్రేక్ వేశారు. స్పిరిట్ తాలూకు సాలిడ్ ఎనౌన్స్ మెంట్ ని కూడా సంక్రాంతికి మార్చారు. అంతగా రెబల్ ఫ్యాన్స్ కి ది రాజా సాబ్ ఏం సర్ ప్రైజ్ చేయబోతోంది? పక్కగా టీజరే అని ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ మారుతి ఆల్రెడీ సినీ జనాల్లో టంగ్ స్లిప్ అయినట్టు తెలుస్తోంది. మరి ది రాజా సాబ్ మోషన్ పోస్టర్ కొచ్చిన రెస్పాన్స్ టైం, ప్రొడ్యూసర్ పేల్చిన బాంబు ఇంతకాలానికి రీసౌండ్ చేసేలా ఉందా? ఇంతకి ది రాజా సాబ్ టీజర్ పేలేదెన్నడు..? అందులో సర్ ప్రైజ్ ఏముండబోతోంది? హావేలుక్
సలార్, కల్కీ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ కిక్ ఇచ్చేందుకు ఏప్రిల్ లో ముహుర్తం చూసుకున్నాడు రెబల్ స్టార్. ఆల్ మోస్ట్ ఏప్రిల్ 10కి ఇంకా 130 రోజుల టైముంది… ఐతే 105 రోజుల ముందు ది రాజాసాబ్ టీజర్ ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆల్రెడీ మూడు టీజర్లు కట్ చేసే ప్రాసెస్ లో రెండు టీజర్లు రెడీ చేసింది ఫిల్మ్ టీం. మూడో టీజర్ ఈ వీకెండ్ లోగా రెడీఅయితే, ఫైనల్ టీజర్ ని ప్రభాస్ ఫైనల్ సిగ్నల్ ఇస్తే, అదే లాంచ్ చేసే అవకాశం ఉంది
ఇక వచ్చే వారం ఫైనల్ టీజర్ కి డబ్బింగ్, ఆర్ ఆర్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. సో కల్కీ, సలార్ రెండూ కూడా ఇలానే అచ్చంగా సినిమా రిలీజ్ కి కనీసం వందరోజుల ముందు టీజర్ వదిలారు. ఇప్పడు 105 రోజులు ముందే ది రాజా సాబ్ టీజర్ ని భారీ ఎత్తున లాంచ్ చేసి, ఫ్యాన్స్ కి భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు
మొదట్నుంచి అంతా అనుకుంటున్నట్టే ఈనెల 25న క్రిస్మస్ స్పెషల్ గా ది రాజా సాబ్ టీజర్ రాబోతోంది. ఏకంగా నిమిషం మీద 30 సెకన్లు అంటే 90 సెకన్ల డ్యూరేషన్ తో టీజర్ ఉండాలనేది డైరెక్టర్ మారుతి నిర్ణయమని తెలుస్తోంది.
ఇంతకి ఈ 90 సెకన్ల సెంటిమెంట్ ఏంటో మాత్రం ఇంకా తేలలేదు. ఇందులో ప్రభాస్ మూడు గెటప్పుల్లో ఉంటాడనే ప్రచారం ప్రకారం చూస్తుంటే, ప్రతీ 30 సెకన్లకో పాత్రని పరిచయం చేసి, మొత్తంగా ముగ్గురు రెబల్ స్టార్ల కంటెంట్ తో షాక్ ఇచ్చే ఏర్పాట్లేవో జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది
ఈనెల 20న ఈ మూవీ టీజర్ సంబందించి షార్ట్ ప్రోమో వదిలి, ఐదు రోజుల తర్వాత అసలు టీజర్ ని లాంచ్ చేస్తారట. ఎనౌన్స్ మెంట్ మాత్రం ఈనెల 10 కి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఫైనల్ టీజర్ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసమే వేయిటింగ్ అని తెలుస్తోంది.
నిజానికి ది రాజా సాబ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుుడు ప్రభాస్ ఏజ్ డ్ లుక్ మీద ఫ్యాన్స్ నుంచి కూడా కాస్త డిసప్పాయింట్ మెంట్ కనిపించింది. ఐతే అసలు విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే మతిపోతుందని నిర్మాతే సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అందుకే అభిమానుల్లో ఆత్రుత పీక్స్ కి చేరింది… క్రిస్మస్ కి ది రాజా సాబ్ టీజర్ రావటం ఆల్ మోస్ట్ కన్పామ్ అయ్యింది. రెబల్ స్టార్ కెరీర్ లోనే ఫస్ట్ హర్రర్ కామెడీ కావటంతో, ఈ టీజర్ కే యూ ట్యూబ్ లో పూనకాలొచ్చే చాన్స్ఉంది. అందుకు ముహుర్తం డిసెంబర్ 25 ఫిక్స్ అయినట్టు ఈ నెల 10న ఫిల్మ్ టీం అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేందుకు సిద్దపడుతున్నట్టు తెలుస్తోంది.