SSMB29 నుంచి చాలా పెద్ద వీడియో లీక్.. మహేష్ ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టారుగా..!
ఒక బెలూన్ లోకి మనం కొట్టాల్సిన గాలి కంటే ఎక్కువగా కొడితే ఒక స్టేజ్ దాటిన తర్వాత అది పగిలిపోతుంది. తాజాగా రాజమౌళి, మహేష్ బాబు సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

ఒక బెలూన్ లోకి మనం కొట్టాల్సిన గాలి కంటే ఎక్కువగా కొడితే ఒక స్టేజ్ దాటిన తర్వాత అది పగిలిపోతుంది. తాజాగా రాజమౌళి, మహేష్ బాబు సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే మరీ ఎక్కువ తీసుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ.. ఈ సినిమా షూటింగ్ నుంచి రోజుకు ఒక లీక్ బయటికి వస్తుంది. ఎంత జాగ్రత్తగా షూట్ ప్లాన్ చేస్తున్న కూడా ఏకంగా వీడియోలు కూడా బయటికి వస్తున్నాయి. అది చూసి రాజమౌళికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న షూటింగ్ డీటెయిల్స్ అన్ని బయటికి వచ్చాయి. తాజాగా ఏకంగా వీడియోనే బయటికి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒడిస్సాలో జరుగుతుంది. రాజమౌళి, మహేష్ తో పాటు చిత్ర యూనిట్ అంతా అక్కడే ఉంది. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందిప్పుడు.
అక్కడ అటవీ ప్రాంతంలో మూడు వారాల షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి. తాజాగా లీక్ అయిన వీడియోలో మహేష్ బాబు విలన్లకు దొరికిపోతాడు. ఒక వీల్ చైర్ లో కూర్చున్న అతని దగ్గరికి.. సూపర్ స్టార్ ను వెనకాల నుంచి విలన్స్ నెడుతూ ఉంటారు. ఆ వీల్ చైర్ వ్యక్తి దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంటాడు మహేష్. ఈ మొత్తం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంత జాగ్రత్తగా షూటింగ్ ప్లాన్ చేసుకుంటుంటే కూడా సోషల్ మీడియాలో ఇలా వీడియోలు బయటకు రావడంతో జక్కన్న అండ్ టీం షాక్ అవుతున్నారు. నిజం చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు రాజమౌళి. ఒక చిన్న వీడియో కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ మహేష్ బాబు విషయంలో మాత్రం మొదటినుంచి ఈ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. కనీసం చిన్న ఫోటో కూడా బయటకి ఇవ్వకపోవడంతో సినిమా గురించి పాడ్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఏ చిన్న లీక్ వచ్చినా కూడా అందరికంటే ముందు దాన్ని అభిమానులే వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇలా లీక్ అయిన వీడియో బయట వైరల్ చేయడం తప్పు అనే విషయాన్ని కూడా అభిమానులు మర్చిపోయారు.
మా మహేష్ చూడు ఎంత అందంగా ఉన్నాడు అంటూ దాన్ని వాళ్లే వైరల్ చేస్తున్నారు. ఇదంతా ఆగాలంటే.. ముందు రాజమౌలి తన సినిమా గురించి అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం.. ఒక చిన్న ఫస్ట్ లుక్, వీడియో లాంటిది ఏదో ఒకటి విడుదల చేయడం జరగాలి. లేదంటే ఆకలితో ఉన్న అభిమానులు సోషల్ మీడియాలో ఏం దొరికినా కూడా ఇలాగే వైరల్ చేస్తుంటారు. దాని కంట్రోల్ చేయాలంటే ఎవరి తరం కాదు. ఒకసారి వీడియోలు లీకైన తర్వాత బయటికి వచ్చి అవి నానా హంగామా చేస్తుంటాయి. అలాంటి సమయంలో వాళ్లు చేయగలిగింది ఏమీ ఉండదు.. అలా చేయడం తప్పు అని చెప్పడం తప్ప..! మొన్నటికి మొన్న మహేష్ బాబు జిమ్ వీడియో బయటకు వచ్చినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఫాన్స్ ఎక్కువగా రచ్చ చేశారు. ఇప్పుడు లీక్ అయిన వీడియో కూడా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతుంది. జరిగిందేదో జరిగిపోయింది ఇకమీద నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు రాజమౌళి. మరి అది సాధ్యమవుతుందా లేదా అనేది చూడాలి.