ఆదిపురుష్ కి కలిసొచ్చింది.. అదే సలార్ కొంపముంచుతోంది..!

ఆది పురుష్ టీజర్ భయపెట్టినా, సాంగ్స్, ట్రైలర్ మాత్రం దుమ్ముదులిపి, అసలు లెక్కే మార్చింది. అయితే ఈ విషయంలో సంతోషపడాలో, సలార్ మూవీకి ఇదే ఆదిపురుష్ సినిమా పంచ్ ఇచ్చేలా ఉందని బాధపడాలో తేల్చుకోలేని పరిస్థితి ప్రశాంత్ నీల్ ది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 15, 2023 | 04:31 PMLast Updated on: May 15, 2023 | 4:31 PM

Aadipurush Effect To Salaar

ఎందుకంటే సలార్ మూవీ టీజర్ ఎప్పుడో ఎడిట్ చేసింది ఫిల్మ్ టీం. ఇప్పుడు రిలీజ్ చేయటానికి ఛాన్స్ లేదు. ఆదిపురుష్ స్వింగ్ లో ఉంది. జూన్ 16 న రాబోతోంది. రిలీజైన 30 రోజుల వరకు ఈ మూవీ సందడే ఉంటుంది. ఆతర్వాత అంటే జులై 16 తర్వాతే సలార్ టీజర్ రిలీజ్ చేయాలి..

అలా అయితే ట్రైలర్ ఎప్పుడు, సాంగ్స్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ 28న సినిమాను రిలీజ్ చేయటం పక్కా అంటూ గాసిస్ప్ కి బ్రేక్ వేసింది ప్రొడక్షన్ టీం. అదే నిజమైతే, ఆదిపురుష్ జోరు వల్ల, సలార్ ప్రమోషన్ డల్ అయ్యేలా ఉంది. టైం సరిపోయేలా లేదనే మాటే వినిపిస్తోంది.