Prabhas: ఆదిపురుష్ ట్రైలర్, సలార్ టీజర్.. రెండీంటికి ముహుర్తం ఫిక్స్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు నెల్ల గ్యాప్ లో రెండు సర్ ప్రైజ్ లు రెడీ చేశాడు. అది ఒకటి ఆదిపురుష్ ట్రైలర్. ఇక మరొకటి సలార్ టీజర్. మే సెకండ్ వీక్ లో ఆదిపురుష్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతోంది ఫిల్మ్ టీం. ఏకంగా 3 నిమిషాల 35 సెకన్ల డ్యూరేషన్ తో ఆదిపురుష్ ట్రైలర్ కట్ చేశారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 26, 2023 | 05:00 PMLast Updated on: Apr 26, 2023 | 5:00 PM

Aadipurush Trailer And Salaar Teaser Releaseing Date Fix

అంతేకాదు మే 20 నుంచి ప్రతీ 3 రోజులకో పాటని రివీల్ చేస్తూ ఆదిపురుష్ ప్రమోషన్ లోఎమోషన్ పెంచబోతోంది సినిమా టీం. మొత్తానికి ఆదిపురుష్ ట్రైలర్ ని ఓరౌత్ అండ్ టీం రెడీ చేసింది. సాంగ్స్ ని కూడా వన్ బై వన్ మే 20 నుంచి రిలీజ్ చేయబోతోంది. దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్స్ ని భారీగా ప్లాన్ చేస్తున్నరని తెలుస్తోంది. ఢిల్లీ రామ్ లీలా మైదానం, అలానే ముంబై, కోల్ కత, హైదరాబాద్ నగరాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఇక సలార్ విషయానికొస్తే, ఆదిపురుష్ రిలీజ్ అయిన 30 రోజుల వరకు సలార్ తాలూకు అప్ డేట్స్ రాకూడదని ప్రభాస్ నిర్ణయం తీసుకున్నాడు. కాకపోతే ఆ నిర్ణయంలో చిన్న మార్పులు జరిగాయట. జూన్ 16న ఆదిపురుష్ రిలీజ్ కాబోతోంది. అంటే మరో 14 రోజులు తర్వాత అంటే జులై 1 న సలార్ టీజర్ ని విడుదల చేయాలని ఫిల్మ్ టీం డిసైడ్ అయ్యిందట. ఆగస్ట్ 15 కి ట్రైలర్ లాంచ్ కాబోతోందట. ఇలా ప్రభాస్ తన ఫ్యాన్స్ కి వరుస సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశాడని తెలుస్తోంది.