Suhani Bhatnagar: చిన్న వయసులోనే కన్నుమూసిన దంగల్ నటి.. కారణం ఇదే..
19 ఏళ్ల వయసులోనే సుహాని మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం 2016లో విడుదలైంది.

Suhani Bhatnagar: బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దంగల్ చిత్రంలో నటించిన బాలనటి కన్నుమూసింది. ఈ చిత్రంలో అమీర్ రెండో కూతురుగా నటించిన సుహాని భట్నాగర్ (19) అనారోగ్యంతో కన్నుమూసింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో శనివారం సుహాని మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల సుహాని ప్రమాదానికి గురైంది. ఆమె కాలు విరిగింది. ఈ క్రమంలో కొన్ని మందులు వాడింది.
Devara 2 : ఎంత దెబ్బ కొట్టావు దేవరా..
వాటి సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే సుహాని మరణించినట్లు తెలుస్తోంది. మందుల దుష్ప్రభావాల కారణంగా ఒళ్లంతా నీరు పట్టింది. దీంతో సుహానిని ఆమె కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. అక్కడి చికిత్స పొందుతూ సుహాని ప్రాణాలు కోల్పోయింది. 19 ఏళ్ల వయసులోనే సుహాని మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం 2016లో విడుదలైంది. ఈ సినిమాలో సుహాని భట్నాగర్ అనే చిన్నారి.. అమీర్ ఖాన్ రెండో కూతురు బబిత ఫోగట్ పాత్రలో నటించి, మెప్పించింది.
ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సుహాని నటనకు కూడా మంచి పేరొచ్చింది. ఈ సినిమా తర్వాత సుహానికి పలు చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. అయితే, చదువుపై దృష్టిపెట్టిన ఆమె.. సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే కన్నుమూసింది.