డైవర్స్ లేదు బొక్కా లేదు… ఐశ్వర్యే నా పెళ్ళాం

సినిమా వాళ్ళ కాపురాల్లో ఏ చిన్న పొగ వచ్చినా అది వైల్డ్ ఫైర్ అయ్యే వరకు జనాలకు కంటి మీద కునుకు ఉండదు. పచ్చగా ఉన్న కాపురంలో సోషల్ మీడియా నిప్పులు పోస్తోంది అంటూ సినిమా వాళ్ళే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. సమంతా, నాగ చైతన్య విషయంలో ఇదే జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 25, 2024 | 07:38 PMLast Updated on: Nov 25, 2024 | 7:38 PM

Abhishek Bachan Clarity About Seperate With Aishwarya Rai

సినిమా వాళ్ళ కాపురాల్లో ఏ చిన్న పొగ వచ్చినా అది వైల్డ్ ఫైర్ అయ్యే వరకు జనాలకు కంటి మీద కునుకు ఉండదు. పచ్చగా ఉన్న కాపురంలో సోషల్ మీడియా నిప్పులు పోస్తోంది అంటూ సినిమా వాళ్ళే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. సమంతా, నాగ చైతన్య విషయంలో ఇదే జరిగింది. ఐశ్వర్య, అభిషేక్ విషయంలో ఇదే జరుగుతుందని భావించారు. ఇద్దరూ డైవర్స్ తీసుకుంటే ఆ ఇద్దరికీ ఎవరెవరితో పెళ్లి చేయాలో సంబంధాలు కూడా చూసారు సోషల్ మీడియా జనాలు. ఇప్పుడు వాళ్లకు స్లిప్పర్ షాట్ ఇచ్చాడు అభిషేక్ బచ్చన్.

అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌ 2007లో వివాహం చేసుకోగా… వాళ్ళు విడిపోయారు అంటూ కథనాలు ప్రసారం చేసారు. ఐశ్వర్య గురించి అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఫ్యామిలీ విషయంలో తను ఎంతగానో సపోర్ట్‌ చేస్తుందని క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. నేను బయటకు వెళ్లి సినిమాలు చేయగలుగుతున్నానంటే అది నిజంగానే నా అదృష్టం అంటూ… తన భార్య గురించి ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. మా కుమార్తె ఆరాధ్య యోగక్షేమాలు చూసుకుంటూ ఐశ్వర్య ఇంట్లోనే ఉంటుందన్నాడు.

ఆ విషయంలో తనకు కృతజ్ఞతలు చెబుతున్నా అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న రోజుల్లో ఈ విషయం పిల్లలకు కూడా అర్థమవుతోందని…వారు కూడా తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారని పేర్కొన్నాడు. కుటుంబం విషయంలో ఐశ్వర్య సపోర్ట్‌ చేయడం వల్లే నేను సినిమాలపై పూర్తిగా దృష్టిపెట్టగలుగుతున్నాను అని క్లారిటీ ఇచ్చేసాడు. ఇక తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ నేను పుట్టిన వెంటనే మా అమ్మ జయా బచ్చన్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పేశారని గుర్తు చేసుకున్నాడు. భర్త, పిల్లలు కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలని ఆమె అనుకున్నారన్నాడు.

అందుకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నారట అని చెప్పుకొచ్చాడు. నాన్న సినిమాలతో బిజీగా ఉన్నా.. వాళ్లిద్దరూ మాకు లోటు తెలియనివ్వలేదని పేర్కొన్నాడు. నా చిన్నతనంలో వరుస సినిమాలతో నాన్న ఖాళీ లేకుండా ఉండేవారన్న అభిషేక్… నేను పడుకునే సమయానికి ఆయన ఇంటికి వచ్చేవారని… నిద్ర లేచేటప్పటికి సెట్‌కు వెళ్లిపోయేవారన్నాడు. కాకపోతే, ఏ సమయంలో ఇంటికి వచ్చినా సరే.. నా గదిలోకి వచ్చి నన్ను చూసి వెళ్లేవారని… ఎన్ని వర్క్స్‌ ఉన్నా.. స్కూల్‌లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు నాన్న హాజరయ్యేవారు అని గుర్తు చేసుకున్నాడు. నా బాస్కెట్‌ బాల్‌ పోటీలకూ వచ్చి ప్రోత్సహించేవారని చెప్పాడు అభిషేక్. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు స్ఫూర్తిని ఇవ్వాలన్నాడు. ఐశ్వర్య కొన్నాళ్ళు సినిమాల్లో చేసారు. అప్పుడప్పుడు ఆమె సినిమాలలో మెరుస్తున్నా రెగ్యులర్ గా మాత్రం చేయడం లేదు. అభిషేక్ మాత్రం హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.