Aishwarya Raii : అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు
సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది కామన్‌గా మారిపోయింది. ఇప్పటికే తెలుగులో స్టార్ జోడీ నాగ చైతన్య, సమంత విడిపోయారు. తమిళ్‌లో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు.
సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది కామన్‌గా మారిపోయింది. ఇప్పటికే తెలుగులో స్టార్ జోడీ నాగ చైతన్య, సమంత విడిపోయారు. తమిళ్‌లో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. హిందీలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కూడా డివోర్స్ తీసుకోబోతున్నట్టుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే.. గతంలో ఈ విషయంలో స్పందించిన అభిషేక్.. అలాంటిది ఏం లేదని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఐశ్యర్య మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు.
అంతేకాదు.. ఐశ్యర్య రాయ్ తన కుమార్తే ఆరాధ్యతో విడిగా ఉంటోంది.. అనే టాక్ కూడా ఉంది. ఇప్పుడది నిజమేనని అంటున్నారు. తాజాగా ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్‌ల పెళ్లి వేడుక అంగరంగా వైభవంగా జరిగింది. ముంబయిలోని జియో కన్వెన్షన్ ఈ పెళ్లికి వేదిక అయింది. ఈ పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తం అటెండ్ అయ్యారు.
తమ డ్యాన్స్‌లతో కేక పుట్టించారు. ఇక పెళ్లికి అమితాబ్ కుటుంబం కూడా హాజరైంది. అయితే.. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్, ఆమె పిల్లలంతా కలిసి వచ్చారు. కానీ ఐశ్వర్యారాయ్, కూతురు ఆరాధ్య మాత్రం విడిగా వచ్చారు. ఫోటోలు కూడా విడి విడిగానే ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిషేక్, ఐశ్వర్య విడాకులు ఖాయమని టాక్ ఊపందుకుంది. మరి ఈసారి అభిషేక్, ఐశ్వర్య దీని పై స్పందిస్తారేమో చూడాలి.