Devara1, Pushpa 2 : దేవర 1, పుష్ప 2 వాయిదా..
సోషల్ మీడియా (Social Media) టాక్ ప్రకారం.. దేవర (Devara) పార్ట్ 1, పుష్ప పార్ట్ 2 రిలీజ్ డేట్స్ విషయంలో అభిమానులు డైలమాలో పడిపోయారు. అసలే పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటికే పార్ట్ 2 లేట్ అయిందని బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటే.. మరోసారి పుష్ప2 వాయిదా పడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

According to social media talk, fans are in a dilemma regarding the release dates of Devara Part 1 and Pushpa Part 2.
సోషల్ మీడియా (Social Media) టాక్ ప్రకారం.. దేవర (Devara) పార్ట్ 1, పుష్ప పార్ట్ 2 రిలీజ్ డేట్స్ విషయంలో అభిమానులు డైలమాలో పడిపోయారు. అసలే పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటికే పార్ట్ 2 లేట్ అయిందని బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటే.. మరోసారి పుష్ప2 వాయిదా పడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి దేవర పోస్ట్‌పోన్ మరింత బలం ఇస్తోంది. ఏపిలో ఎలక్షన్స్ కారణంగా ఏప్రిల్ 5 నుంచి దేవర వాయిదా పడిందని.. సోషల్ మీడియా వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
అంతేకాదు.. పుష్ప2 ప్లేస్‌లో, అంటే ఆగష్టు 15న దేవర రిలీజ్ కానుందని అంటున్నారు. ఇదే నిజమైతే పుష్ప2 కూడా పోస్ట్ పోన్ అయినట్టే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే కారణంగా ఆగష్టు 15 నుంచి డిసెంబర్‌కి పుష్ప2 వాయిదా పడినట్లు లేటెస్ట్ టాలీవుడ్ (Tollywood) వర్గాల టాక్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయినా కూడా ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు. వస్తే ముందుగా దేవర టీమ్ నుంచే క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం నందమూరి ఫ్యాన్స్ క్లారిటీ కావాలంటూ ట్రెండ్ చేస్తున్నారు
ఇప్పటికే దేవర షూటింగ్ 85 శాతం కంప్లీట్ అయింది. అనుకున్న సమయానికి కొరటాల శివ షూటింగ్ (Devara Shooting) కంప్లీట్ చేసేలా ఉన్నప్పటికీ.. ఎలక్షన్స్‌తో పాటు హిందీలో కొన్ని సినిమాల రిలీజ్ కారణంగా దేవర పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు పుష్ప2 షూటింగ్ కూడా జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఆగష్టు 15న రిలీజ్ చేయాలని సుకుమార్ ముందుకు సాగుతున్నాడు. కానీ పోస్ట్ పోన్.. అనే న్యూస్‌తో ఫ్యాన్స్ డైలమాలో పడిపోయారు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.