స్టార్ హీరో కమిట్మెంట్ అడిగాడు.. విప్పి చూపిస్తా.. నా ఇష్టమంటున్న అనసూయ

యాంకర్ నుంచి యాక్టర్ గా మారిన అనసూయ... ఈ మధ్యకాలంలో చేస్తున్న కొన్ని కామెంట్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి. ఆమె ఏం మాట్లాడిన సరే సోషల్ మీడియా జనాలు ఆమెను గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 6, 2025 | 02:50 PMLast Updated on: Feb 06, 2025 | 2:50 PM

Actor Anasuya Sensational Comments

యాంకర్ నుంచి యాక్టర్ గా మారిన అనసూయ… ఈ మధ్యకాలంలో చేస్తున్న కొన్ని కామెంట్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి. ఆమె ఏం మాట్లాడిన సరే సోషల్ మీడియా జనాలు ఆమెను గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. బోల్డ్ కామెంట్స్ చేసే అనసూయ ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీస్ విషయంలో వెనుకా ముందూ చూసుకోకుండా కామెంట్స్ చేస్తోంది. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ.. కాస్టింగ్ కౌచ్ గురించి అలాగే హేట్ కామెంట్స్ గురించి మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

ఓ స్టార్ హీరో డైరెక్టర్ తనని కమిట్మెంట్ అడిగితే ఏం చేసిందో చెప్పింది. అలాగే ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా మాట్లాడింది. అమ్మాయిలు, అబ్బాయిలు మధ్య అట్రాక్షన్ అనేది చాలా కామన్ అని, సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఏ రంగంలోనైనా సరే ఇది కామన్ గా మారిందని అనసూయ తను ఒపీనియన్ చెప్పింది. అయితే అవకాశాల పేరుతో వాడుకోవడానికి చాలామంది హీరోలతో పాటు, డైరెక్టర్లు అలాగే నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారని, తన విషయంలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయని గుర్తు చేసుకుంది.

ఓ స్టార్ హీరో అడిగితే డైరెక్ట్ గా నో చెప్పానని క్లారిటీ ఇచ్చింది. అలాగే ఓ పెద్ద డైరెక్టర్ ప్రపోజల్ ను కూడా సున్నితంగా తిరస్కరించారానని అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలా చెప్పడం వల్ల ఆఫర్లు తన వరకు రాలేదని… రానివ్వలేదని బయటపెట్టింది. అయితే నో చెప్పడమే కాదు, అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కూడా అమ్మాయిలకు ఉంటే మంచిదని వ్యాఖ్యలు చేసింది అనసూయ. అలాంటి వాటికన్నా కళను, మనలో ఉన్న టాలెంట్ ను చూసి పాత్రలు ఇస్తే బెటర్ అనిపిస్తుందని, ఆమె రాకపోతే ఏం ఈ క్యారెక్టర్ అయితే బాగా చేస్తుంది కదా అని అనుకున్నప్పుడు ఛాన్స్ వస్తే బాగుంటుందని కామెంట్ చేసింది.

అలాంటప్పుడే చాలామంది అమ్మాయిలు ఈ రంగంలోకి అడుగుపెడతారని వ్యాఖ్యలు చేసింది అనసూయ. అదేవిధంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు కొందరు ఈజీ మార్గాలను ఎంచుకుంటున్నారని, ఇది సరైన నిర్ణయం కాదని చెప్పింది. పదిమంది తప్పు చేస్తున్నారు కదా అని నేను కూడా చేస్తాను అనడం కరెక్ట్ కాదంది. ఈజీ వేలో కాకుండా కష్టాన్ని కళను నమ్ముకుని, ప్రయత్నిస్తే మంచిదని తన ఒపీనియన్ షేర్ చేసుకుంది. మార్పు మెల్లగా మొదలైందని, టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీలో అమ్మాయిలు అడుగు పెడతారని అనసూయ వ్యాఖ్యలు చేసింది. ఇక సోషల్ మీడియాలో తనని ఇష్టపడే వాళ్ళ కోసమే… ఫోటోలు షేర్ చేస్తానని, అక్కడ ఎలాంటి ఫోటోలు షేర్ చేస్తాననేది, తన ఇష్టం అంది. తాను బికినీ వేసుకోవాలా లేదంటే మొత్తం విప్పి తిరగాలా అనేది తన ఇష్టం అని, దానివల్ల ఎవరూ ఇబ్బంది పడట్లేదు అని… అయినా తనపై మీ పెత్తనం ఏంటని ఫైర్ అయింది.