RAM CHARAN: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్ అకాడమీ జాబితాలో చోటు..

ఆస్కార్‌ అకాడమీలోని యాక్టర్స్‌ బ్రాంచ్‌‌లో చరణ్‌కు సభ్యత్వం దక్కడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్థానం సంపాదించుకోగా.. ఇప్పుడు రామ్‌ చరణ్‌ పేరును అకాడమీ అధికారులు ప్రకటించడంతో మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు హాట్​ టాపిక్​గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 2, 2023 | 01:09 PMLast Updated on: Nov 03, 2023 | 6:49 PM

Actor Ram Charan Joins Actors Branch Of Academy Of Motion Picture Arts And Sciences

RAM CHARAN: ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ఎంత సంచలనం సృష్టించిందో స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్లని రాబ‌ట్టింది. `నాటు నాటు` పాట‌కుగానూ హాలీవుడ్ స్టార్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ (Oscar) పుర‌స్కారాల‌ని ద‌క్కించుకుని భార‌తీయ సినీ చ‌రిత్రలోనే స‌రికొత్త చ‌రిత్రను లిఖించింది. హాలీవుడ్ వ‌ర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (RAM CHARAN).

ఈ సినిమాలో అల్లూరిగా, రామరాజుగా చేసిన పెర్ఫార్మెన్స్‌కు హాలీవుడ్ దర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. కళ్ళల్లో అద్భుతమైన ఎమోషన్స్ పలికించాడని బిగ్ ఫిల్మ్ మేకర్స్ ప్రశంసలు కురిపించారు. ఇలా అనేక రకాలుగా చరణ్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‌ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేసే మూమెంట్‌ వచ్చేసింది. ఆస్కార్‌ అకాడమీలోని యాక్టర్స్‌ బ్రాంచ్‌‌లో చరణ్‌కు సభ్యత్వం దక్కడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్థానం సంపాదించుకోగా.. ఇప్పుడు రామ్‌ చరణ్‌ పేరును అకాడమీ అధికారులు ప్రకటించడంతో మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు హాట్​ టాపిక్​గా మారింది. చరణ్‌కు ఆ అరుదైన అవకాశం దక్కడంతో ఇదో ప్రౌడ్‌ మూమెంట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు ఫ్యాన్స్, సినీ లవర్స్. ఇక అస్కార్ నిర్వాహకులు రాసుకొచ్చిన మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అకాడమీ విడుదల చేసిన జాబితాలో చరణ్​తో పాటు హాలీవుడ్ నటులు లషనా లించ్​, విక్కీ క్రీప్స్​, లూయిస్​ కూ టిన్ లోక్​, కెకె పామర్​, చాంగ్ చెన్​ కూడా ఈ ఘనతను అందుకున్నారు.

ఈ అద్భుతమైన నటులను తమ యాక్టర్స్​ బ్రాంచ్​లో ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని.. ఎంతో అంకిత భావంతో నటులు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారని ఆస్కార్​ నిర్వాహకులురాసుకొచ్చారు. ఎన్నో సినిమాల్లో తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారని, ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలను మనకు బహుమతిగా అందించారని ప్రశంసలు కురిపించారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రజెంట్ సెన్సేషన్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నాడు. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. దీపావళికి ఫస్ట్ సాంగ్ రానుంది. ఇక ఈ మూవీ తర్వాత బుచ్చిబాబుతో కలిసి ఆర్సీ 16ను మొదలు పెట్టనున్నాడు. మొత్తానికి రామ్ చరణ్ ఇమేజ్ గ్లోబల్ స్టాయికి చేరడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.