Silambarasan TR: పెళ్లి చేసుకోబోతున్న కోలీవుడ్ స్టార్ శింబు.. అమ్మాయి ఎవరంటే..?
గత కొంతకాలంగా శింబు, హీరోయిన్ నిధి అగర్వాల్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. వీరిద్దరూ కూడా ఈ పుకార్లను ఖండించకపోయేసరికి నిజమే అనుకున్నారు కూడా. కాగా శింబు నిధిని పెళ్లి చేసుకోవడం అనేది రూమర్ అంట.

Silambarasan TR: కోలీవుడ్ రొమాంటిక్ హీరో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శింబు పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఎప్పటినుంచో శింబు పెళ్లి వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తూనే వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం నిజమే అని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. గత కొంతకాలంగా శింబు, హీరోయిన్ నిధి అగర్వాల్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి.
వీరిద్దరూ కూడా ఈ పుకార్లను ఖండించకపోయేసరికి నిజమే అనుకున్నారు కూడా. కాగా శింబు నిధిని పెళ్లి చేసుకోవడం అనేది రూమర్ అంట. అయితే ఇప్పుడు చిత్రపరిశ్రమకు చెందిన అమ్మాయిని శింబు పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నయనతార, హన్సికలతో లవ్ ట్రాక్ నడిపిన శింబు.. ఈ ఇద్దరికి పెళ్లిళ్లు అయిన తర్వాత పెళ్లి చేసుకోనుండటం హాట్ టాపిక్‌గా మారింది. శింబుకు కాబోయే భార్యచిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయి అని తెలుస్తుంది. ఒక సినీ ఫైనాన్షియర్ కూతురితో శింబు పెళ్లి ఓకే అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఓ పార్టీలో శింబు ఆ అమ్మాయిని కలిశారని, ఆ పరిచయం ప్రేమగా మారిందని, అదే ఇప్పుడు ఇద్దరికీ పెళ్లి పీటల వైపు అడుగులేయిస్తుందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాక సీక్రెట్‌గా వీరి పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయని టాక్. వీరి పెళ్లి గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. శింబు పెళ్లి వార్త తెలిసి అభిమానులు ఖుషి అవుతున్నారు.