Balayya : బాలయ్య వచ్చేది అప్పుడేనా..?
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస హిట్స్‌తో జోరు మీదున్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి విజయాలను నమోదు చేసాయి. ప్రజెంట్ హాట్రిక్ హిట్స్ తో పాటు బాక్ టు బాక్ 70 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని కెరీర్ లోనే ది బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య..
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస హిట్స్‌తో జోరు మీదున్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి విజయాలను నమోదు చేసాయి. ప్రజెంట్ హాట్రిక్ హిట్స్ తో పాటు బాక్ టు బాక్ 70 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని కెరీర్ లోనే ది బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య.. ప్రస్తుతం కె.ఎస్ బాబీ (KS Bobby) డైరెక్షన్ లో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ సినిమాతో మళ్లీ ఈ ఇయర్ దసరా బరిలో దిగాలని చూస్తున్నాడు. N.B.K 109 గా రూపొందుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అనంతరం.. తనకి హాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinivas) తో నెక్ట్స్ మూవీ కన్‌ఫామ్ చేసినట్లు సమాచారం.. ఈ మూవీని 2025 సమ్మర్ కి తీసుకు వచ్చేలా బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది.
కరోనా చివరి దశ సమయంలో సినిమా రిలీజ్ చేస్తే అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే ఆలోచనలో పడిపోయిన మేకర్స్‌కు, చిత్రసీమకు ఊపిరిపోసిన సినిమా ‘అఖండ’ (Akhanda) . 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌తో సౌండ్ మోగించింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అప్పుడే ప్రకటించారు. ఇప్పుడు అఖండ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ కే కాదు సినీ ప్రేక్షకులకు అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. కాగా.. అఖండ 2′ (Akhanda-2) గురించి ప్రస్తుతం చిత్రసీమలో ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. అఖండ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ఉంటుందని.. నార్త్ ఆడియన్స్ ని కూడా మెప్పించేలా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది.
అయితే.. బోయపాటి డైరెక్షన్ లో ఇటీవల వచ్చిన స్కంధ అట్టర్ ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. అయితే.. ఆ ఎఫెక్ట్ ఈ మూవీపై ఎఫెక్ట్ చూపించదంటున్నారు విశ్లేషకులు.. ఎందుకంటే.. బాలయ్య-బోయపాటి కాంబోకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన్‌లో సినిమా వచ్చిందంటే హిట్ పడినట్లే లెక్క.. ఈలెక్కన వస్తున్న అఖండ-2 కూడా భారీ హిట్ ఖావడం ఖాయమంటున్నారు. ఈ సినిమాను అక్టోబర్ లో మొదలు పెట్టి ఆరు నెలలు షూట్ చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 2025 సంక్రాంతికి ఆల్రెడీ భారీ సినిమాల రిలీజ్ లు ఉన్నాయి. ఈ ఇయర్ 109వ సినిమా వస్తే 2025 సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వచ్చే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి అఖండ 2 రిలీజ్ అయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.. మొత్తానికి అటు బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు ఇటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అఖండ-2 ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాల్సిందే మరి..