Vijay Kanth : నల్లగా ఉన్నాడన్నారు… ఏడాదిలో 18 సినిమాల్లో నటన !!

సినిమా రంగంలోకి అడుగుపెట్టేటప్పుడు అమితాబ్, చిరంజీవి లాంటి వాళ్ళే అవమానాలు ఎదుర్కొన్నారు. చెన్నైలో కన్నుమూసిన విజయ్ కాంత్ కూడా నల్లగా ఉన్నాడని హేళన చేశారు.  కానీ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఒకే ఏడాదిలో 18 సినిమాల్లో నటించి సంచలనం సృష్టించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2023 | 01:58 PMLast Updated on: Dec 28, 2023 | 1:58 PM

Actor Vijay Kanth Death

చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు కెప్టెన్ విజయ్ కాంత్.  సినిమాల్లోకి రావాలంటే గాడ్ ఫాదర్స్ ఉండాలంటారు. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు.  కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.  నల్లగా ఉండటంతో అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆయన చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయం చెప్పారు.  ఎంతోమంది తనను కలర్ కారణంగా రిజెక్ట్ చేసినా… పట్టు వదలకుండా ప్రయత్నాలు చేసినట్టు చెప్పాడు.

విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి.  కానీ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టగానే తన పేరును మార్చుకున్నాడు.  విజయ్ మొదటి సినిమా ఇనిక్కమ్ ఇళమై (1979)లో వచ్చింది.  దీని దర్శకుడైన ఏంఏ కాజాకు విజయ్ మొదటి పేరు నచ్చలేదు. అప్పుడు అతని పేరులోని విజయ్ ని తీసి… కాంత్ యాడ్ చేశాడట. మొదటి సినిమాలో విజయ్ కాంత్ విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా అవేవీ హిట్ కాలేదు.

27యేళ్ల వయస్సులో సినిమాల్లోకి ప్రవేశించిన విజయ్ కాంత్ మొత్తం 150కి పైగా మూవీస్ లో నటించాడు.  దూరతు ఇడి ముళక్కం, సత్తం ఓరు ఇరుత్తర్లై అనే రెండు సినిమాల సక్సెస్ తో విజయ్ కాంత్ కు 2015 దాకా వరుసగా ఆఫర్లు వచ్చాయి.  ఏడాదికి ఐదారు సినిమాలు రిలీజ్ చేయడానికి ఆయన మూడు షిప్టుల్లో నటించాల్సి వచ్చింది.  ఇక 1984లో విజయ్ కాంత్ నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి.  అవన్నీ సక్సెస్ అయ్యాయి.

ప్రభుత్వ ఉద్యోగిని చేయాలనుకున్న తండ్రి

విజయ్ కాంత్ తండ్రి ఓ రైస్ మిల్లు నడుపుతుండేవారు.  కొడుకుని బాగా చదివించి గౌవర్నమెంట్ ఉద్యోగం చేయించాలని కలలు కన్నారు.  కానీ విజయ్ కి మాత్రం చిన్నప్పటి నుంచి సరిగా చదివేవాడు కాదు.  ఎప్పుడూ సినిమాలు చూస్తుండేవాడు. ఎంజీఆర్ మూవీస్ చూస్తూ… ఆయన లాగే పెద్ద హీరో కావాలని కలలు కనేవాడు విజయ్ కాంత్.