Actress: పెళ్లి కాకుండా తల్లైన హీరోయిన్స్ వీళ్లే
తాను ప్రెగ్నెంట్ అంటూ హీరోయిన్ ఇలియాన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇలియానాకు పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండానే ఎలా తల్లి అయ్యావంటూ ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. నిజానికి ఇలాంటి సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ అయ్యాయి. ఇలా చాలా మంది పెళ్లి కాకముందే తల్లి అయ్యారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుంటే.. కొందరు మాత్రం ఇంకా డేటింగ్‌లోనే ఉన్నారు.
ఒకప్పుడు శ్రీదేవి నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇలియానా దాకా చాలా మంది హీరోయిన్స్ పెళ్లి కాకముందే తల్లి అయ్యారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అప్పటి టాప్ ప్రొడ్యూసర్ బోనీకపూర్‌తో డేటింగ్ చేసిన శ్రీదేవి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ కూడా పెళ్లి కాకుండానే తల్లిదండ్రులయ్యారు. మొదటి భార్యతో విడాకులు అయ్యాక పవన్ కళ్యాణ్‌తో డేటింగ్‌లో ఉన్నారు రేణు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత పెళ్లి చేసుకున్నారు. ఇక రీసెంట్‌గా ఆలియాభట్ కూడా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యింది. పెళ్లైన ఏడు నెలలకే బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె పెళ్లికి ముందే ప్రగ్నెంట‌్ అంటూ సినీ వర్గాల్లో గాసిప్స్ వచ్చాయి. కొన్ని రోజులకు ఆ విషయాన్ని క్లారిఫై చేసింది ఆలియా. తాను హాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్న టైంలోనే ప్రగ్నెంట్ అని చెప్పింది.
వీళ్లు ముగ్గురు మాత్రమే కాదు. సినీ ఇండస్ట్రీలో ఇలా చాలా మంది పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యారు. ఇప్పుడు ఇలియానా కూడా ఇలాగే చేసింది. అయితే మిగిలిన హీరోయిన్స్ అంతా ఎవరితో బిడ్డను కన్నారో ఓ క్లారిటీ ఉంది. కానీ ఇలియాన మాత్రం తన బాయ్‌ఫ్రెండ్ ఎవరు అన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అప్పట్లో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నిబోస్‌తో ఇలియానా డేటింగ్ చేసింది. కానీ కొన్ని రోజులకే వీళ్లకు బ్రేకప్ జరిగింది. ఆ తరువాత కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు టాక్ నడిచింది. కానీ ఈ విషయంలో ఇలియానా ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు సడెన్‌గా తాను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇలియానా ఫ్యాన్స్ షాకయ్యారు. చెప్పింది మంచి వార్తే కానీ బేబీ వాళ్ల డాడీ ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇలియానా ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.