Actress Hema : మా అసోసియేషన్ నుంచి నటి హేమ సస్పెండ్
ఈ మధ్య మీడియాలో కుదిపేసిన బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) కేసు గురించి అందరికీ తెలిసిందే. ఈ కసులో సినీ నటి హేమ పాల్గొన్న విషయం కూడా మీడియాలో చూశాము. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారన అయినట్లు కూడా వార్తలు రావడంతో మా అసోసియేషన్ (Maa Association) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ మధ్య మీడియాలో కుదిపేసిన బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) కేసు గురించి అందరికీ తెలిసిందే. ఈ కసులో సినీ నటి హేమ పాల్గొన్న విషయం కూడా మీడియాలో చూశాము. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారన అయినట్లు కూడా వార్తలు రావడంతో మా అసోసియేషన్ (Maa Association) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మూవీ ఆర్టిస్ట్స్ (Movie Artists) అసోసియేషన్‌లో భాగస్వామ్యం ఉన్న హేమను మా సస్పెండ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మా సమావేశం జరిగినట్లు అందులో హేమ సస్పెండ్ విషయమై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై మంచు విష్ణు (Manchu Vishnu) తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
గత నెలలో బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్ (Farmhouse) లో రేవ్ పార్టీ కేసులో హేమ కూడా నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో హేమను విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా తాను హాజరు కాలేదు. ఇటీవలే బెంగళూరు పోలీసులు హైదరాబాద్ వచ్చి హేమను అరెస్ట్ చేశారు. తరువాత హేమను అనేకల్‌లోని నాలుగో అదనపు సివిల్, జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. దాంతో ఆమెకు జూన్ 14వరకు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఈ రేవ్ పార్టీలో పలు రకాల డ్రగ్స్ (Drugs) వాడినట్లు పోలీసులు గుర్తించారు. అందులో 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని సీసీబీ అధికారులు తెలిపారు. అందులో 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్ పాజిటివ్ (Drug positive) వచ్చిందని అధికారులు వెల్లడించారు.