Actress Meena: ఎంతకైనా తెగిస్తారా..? రెండో పెళ్లి ప్రచారంపై మీనా ఆగ్రహం..
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను ఎక్కువగా రూమర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి మీనా కూడా బాధితురాలుగా మారారు. ఈ క్రమంలోనే హీరో ధనుష్‌ను మీనా రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
Actress Meena: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు మీనా. తొంబైలలో తెలుగు వారికి దగ్గరైన ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పటికీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సందడి చేస్తూనే ఉంది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సినీ కేరీర్ సాగిపోతున్న తరుణంలోనే మీనా పెళ్లి చేసుకుంది. 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్‌ని వివాహం చేసుకున్నారు. అయితే ఏడాదిన్నర క్రితం విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించారు. వీరికి పదేళ్ల కుమార్తె ఉంది.
Soumya Shetty: నువ్వు ఇక మారవా ? సౌమ్య శెట్టిపై మరోకేసు.. ఈసారి ఏం చేసిందంటే..
అయితే.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను ఎక్కువగా రూమర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి మీనా కూడా బాధితురాలుగా మారారు. ఈ క్రమంలోనే హీరో ధనుష్‌ను మీనా రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారా అంటూ మండిపడింది. భర్త చనిపోయినప్పటి నుంచి మీనా, కూతురితో కలిసి ఒంటరిగానే ఉంటోంది. ఈ క్రమంలో కూతురు భవిష్యత్ కోసం మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తమ కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తితోనే ఈ వివాహం జరుగుతుందని కొన్ని సార్లు.. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తితో వివాహం అంటూ మరికొన్ని సార్లు పుకార్లను స్ప్రెడ్ చేస్తున్నారు. మీనా తల్లిదండ్రులు కూడా రెండో పెళ్లికి ప్రోత్సహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు మీనా కూడా ఓకే చెప్పిందని రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలను స్వయంగా మీనా, ఆమె కుమార్తె కూడా ఖండించినప్పటికీ ఇలాంటి రూమర్లు మాత్రం ఆగడం లేదు.
ఇక రీసెంట్‌గా హీరో ధనుష్‌ను మీనా రెండో వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు పుట్టిస్తున్నారు. ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనా స్పందించింది. సోషల్ మీడియాలో ఇంతలా దిగజారిపోయి వార్తలు రాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వార్తలు పుట్టించే ముందు తన కుమార్తె, తన తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని కోరింది. తనలా ఒంటరిగా జీవించే వాళ్లని ఇలాంటి వార్తలతో ఇబ్బంది పెట్టొద్దని కోరింది. రెండో పెళ్లిపై తనకు ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని.. అలాంటి ఆలోచన ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని తెలిపింది.