నటి స్నేహకు వింత వ్యాధి.. కన్ఫమ్ చేసిన భర్త.. కంగారు పడుతున్న ఫ్యాన్స్..!
సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి స్నేహ.

Un Samayal Arayil Press Meet with Prakash Raj, Sneha and Ilaiyaraaja
సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి స్నేహ. తెలుగుతోపాటు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది ఈమె. ఒక టైంలో సౌందర్య తర్వాత ఆ స్థానాన్ని స్నేహ తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కొన్నేళ్ల పాటు ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈమె. 2012లో తను ప్రేమించిన తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకుని.. హాయిగా లైఫ్ లీడ్ చేస్తుంది స్నేహ. ఇప్పటికీ ఈమె సినిమాలు చేస్తూనే ఉంది.
ఒకప్పుడు హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చూస్తుంది. మధ్య మధ్యలో గోట్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గాను నటించింది. తెలుగులో కూడా స్నేహ బిజీగానే ఉంది. ఇదిలా ఉంటే ఈయన గురించి తాజాగా భర్త ప్రసన్న ఒక షాకింగ్ విషయం చెప్పాడు. స్నేహ ఒక వింత వ్యాధితో బాధపడుతుంది అంటూ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన అసలు నిజం బయట పెట్టాడు. ఇది తెలుసి కంగారుపడుతున్నారు అనే అభిమానులు. ఇంతకీ స్నేహ ఏం వ్యాధితో బాధపడుతుందో తెలుసా.. OCD. ఏంటి ఇది కూడా ఒక వ్యాధా అనుకుంటున్నారు కదా..! చాలామందికి తెలియదు కానీ ఓసిడి కూడా ఒక వ్యాధియే. ఎక్కడ ఏ చిన్న వస్తువు శుభ్రంగా లేకపోయినా కూడా వాళ్ళు అసలు తట్టుకోలేరు. ఎలా బిహేవ్ చేస్తారో కూడా తెలియదు.
ఇదే కాన్సెప్ట్ మీద మారుతి మహానుభావుడు సినిమా చేశాడు. అందులో శర్వానంద్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో.. ఓసిడి సమస్యతో బాధ పడుతున్న వాళ్లు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. స్నేహ కూడా ఇదే వ్యాధితో బాధపడుతుంది అని చెప్పుకొచ్చాడు ప్రసన్న. ఇంట్లో ఏ చిన్న వస్తువు ప్లేస్ మారినా.. లేదంటే ఇక్కడ ఉండాల్సిన వస్తువు మరొకచోట ఉన్నా కూడా స్నేహకు వెంటనే కోపం వచ్చేస్తుందని చెప్పాడు ప్రసన్న. అంతేకాదు ఇల్లు బాలేదు అంటూ ఇప్పటికే మూడుసార్లు మార్చింది అంటూ చెప్పాడు ఈయన. గత 12 సంవత్సరాలుగా మార్చకుండా ఏదైనా ఉంది అంటే అది నన్ను మాత్రమే అంటూ సెటైర్ వేశాడు ప్రసన్న. ఏమైనా కూడా ఓసిడి అంటే తక్కువగా అంచనా వేస్తారు కానీ అది కూడా ఒకరకంగా డేంజర్. అందుకే ఓసిడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.