Sreeleela:‎ లవ్ సీక్రెట్. పెద్దింటి కోడలుగా శ్రీలీల

ఇప్పుడు శ్రీలీల ఇండస్ట్రీలోనే ఓ పెద్దింటి కోడలు కాబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అసలు ఈ న్యూస్ ఎలా లీక్ అయిందో ఏమో గానీ.. శ్రీలీల తల్లి ఆమె జాతకాన్ని ఓ ప్రముఖ జ్యోతిష్యుడికి చూపించిందట. ఆ జ్యోతిష్యుడు.. శ్రీలీల ఓ పెద్దింటికి కోడలుగా వెళ్లబోతుందని చెప్పాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2024 | 02:15 PMLast Updated on: Feb 24, 2024 | 2:15 PM

Actress Sreeleela Will Became A Daughter In Law To A Big Movie Family

Sreeleela: ఇప్పటి వరకు శ్రీలీల లవ్ గురించి ఎలాంటి పుకార్లు బయటికి రాలేదు. కాకపోతే.. భగవంత్ కేసరి సినిమా సమయంలో బాలయ్య కొడుకు మోక్షజ్ఙ.. శ్రీలీలతో కనిపించాడు. ఒక్కసారి కాదు.. ఆ సినిమా మొదలైనప్పటి నుంచి శ్రీలీల వెంటే కనిపించాడు మోక్షజ్ఙ. దీంతో మోక్షజ్ఞ లాంచింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయిందనే కామెంట్స్ వినిపించాయి. చూడ్డానికి ఈ ఇద్దరి జోడి బాగుందని కూడా అన్నారు.

RAM CHARAN: రంగంలోకి రత్నవేలు.. అటు ‘దేవర.. ఇటు ‘ఆర్.సి.16‘

కథ కుదిరితే.. ఫ్యూచర్లో ఈ ఇద్దరు కలిసి నటించే అవకాశాలున్నాయి అని అన్నారు. అయితే ఇదంతా సినిమాటిక్ వెర్షన్ మాత్రమే. కానీ శ్రీలీలతో కలిసి మోక్షజ్ఙ కనిపించడం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కొందరైతే ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని అన్నారు. కానీ ఆ తర్వాత మరోసారి ఇద్దరు కలిసి కెమెరా కంట పడలేదు. దీంతో ఈ వ్యవహారం అక్కడితోనే ఆగిపోయింది. కాని ఇప్పుడు శ్రీలీల ఇండస్ట్రీలోనే ఓ పెద్దింటి కోడలు కాబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అసలు ఈ న్యూస్ ఎలా లీక్ అయిందో ఏమో గానీ.. శ్రీలీల తల్లి ఆమె జాతకాన్ని ఓ ప్రముఖ జ్యోతిష్యుడికి చూపించిందట. ఆ జ్యోతిష్యుడు.. శ్రీలీల ఓ పెద్దింటికి కోడలుగా వెళ్లబోతుందని చెప్పాడట. ప్రస్తుతం కన్నడ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

చిన్నప్పటి నుంచి శ్రీలీల కర్ణాటకలోనే పెరిగింది. బెంగుళూరులోనే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కాబట్టి శ్రీలీల గురించి అక్కడ ఇలాంటి వార్తలు లీక్ అవుతునే ఉంటాయి. కానీ శ్రీలీల జాతకం ప్రకారం ఇండస్ట్రీ ఫ్యామిలీకి కోడలు అనేసరికి.. అమ్మడు ఎవరి ఇంటికి కోడలుగా వెళ్తుందా అనే చర్చ జరుగుతోంది. మరి నిజంగానే శ్రీలీల ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటుందా..? అసలు మ్యాటర్ తెలియాలంటే ఈ బ్యూటీనే క్లారిటీ ఇవ్వాలి.