Colors Swathi: సమంత, నిహారిక దారిలో కలర్స్ స్వాతి? విడాకులు తీసుకోబోతోందా ?
అబ్బో చాలా రోజులైంది వెంటనే వెళ్లి విడాకులు తీసుకోవాలి. ఈ మధ్య సెలిబ్రిటీల పెళ్లి జీవితాలకు తెగ వైరల్ అవుతున్న మీమ్ ఇది.

Actress Swathi, who was introduced to the screen through Colors program, is getting a divorce from her husband
సినిమావాళ్ల పర్సనల్ లైఫ్‌పై రోజుకోరకంగా గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయ్. అన్నీ నిజం కావాలని లేదు. అలాగే అన్నీ అబద్దం అని కొట్టిపారేయలేం. కలర్స్ స్వాతిగా ఫేమస్ అయిన హీరోయిన్ స్వాతికి సంబంధించి ఇప్పుడో న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె త్వరలో విడాకులు తీసుకోబోతుంది అనేది ఆ న్యూస్ కాంటెక్ట్స్. నిజానికి గతంలోనే స్వాతి చుట్టూ ఇలాంటి పుకార్లు షికారు చేసినా.. ఆమె ఇచ్చిన క్లారిటీతో అప్పటికీ అంతా కూల్ అయింది. ఐతే ఇప్పుడు మళ్లీ విడాకులు అంటూ ప్రచారం ఊపందుకుంది. విడాకులు ఖాయం అని చెప్పేందుకు రకరకాల లాజిక్కులను చూపిస్తున్నారు నెటిజన్లు. ఈ మధ్య తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తన భర్త ఫొటోలను డిలీట్ చేసింది స్వాతి. ఇది చాలు విడాకుల విషయంలో స్వాతి ఎలాంటి మైండ్‌సెట్‌తో ఉంది అని చెప్పడానికి అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
గతంలో సమంత, నిహారిక కూడా.. ఇలాగే విడాకులకు కొన్ని నెలల మందు సోషల్ మీడియాలో ఫోటోలను తొలగించారు. వాళ్ల దారిలోనే ఇప్పుడు స్వాతి కూడా వెళ్తుంది అని గుర్తు చేస్తున్నారు. వారు కూడా ఇలాగే విడాకులకు రెండు నెలల ముందు తమ భర్తలను అన్ ఫాలో చేసి విడాకుల హిట్ ఇచ్చారు. ఇప్పుడు స్వాతి కూడా అలాగే చేయడంతో నిజంగానే విడాకులు తీసుకోబోతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కలర్స్ స్వాతి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడే.. వికాస్ వాసు అనే వ్యక్తిని ప్రేమించింది. కొన్నేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉండి.. 2018లో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల కింద ఇలాంటి విడాకుల వార్తలే వినిపించగా.. స్వాతి వాటిని కొట్టిపారేసింది. మరి ఇప్పుడు ఆమె నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.