Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మికి NIA నోటీస్ ! డ్రగ్స్ కేసులో అరెస్ట్ తప్పదా..?

నటి వరలక్ష్మి అసిస్టెంట్ ఆదిలింగం దగ్గర.. 2 వేల వంద కోట్ల విలువైన 3 వందల కేజీల హెరాయిన్, ఏకే 47 గన్, 9 MM తుపాకులు, మందుగుండు సామాగ్రిని NIA అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందుకే ఈ కేసులో విచారణకు వరలక్ష్మి శరత్ కుమార్‌కి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2024 | 04:46 PMLast Updated on: Mar 13, 2024 | 4:46 PM

Actress Varalaxmi Sarathkumar Gets Nia Notices In Drugs Case

Varalaxmi Sarathkumar: సౌతిండియా స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కు NIA నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆమెను విచారించబోతోంది. గతంలో వరలక్ష్మి దగ్గర ఆదిలింగం అనే వ్యక్తి పర్సనల్ అసిస్టెంట్‌గా చేశాడు. డ్రగ్స్, ఆయుధాల సరఫరాలో అతనికి అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్టు NIA గుర్తించింది. అందుకే ఈ కేసులో విచారణకు వరలక్ష్మి శరత్ కుమార్‌కి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

Poonam Kaur: కనికరం లేదా..? షర్మిలపై పూనం కౌర్‌ సంచలన కామెంట్స్‌

నటి వరలక్ష్మి అసిస్టెంట్ ఆదిలింగం దగ్గర.. 2 వేల వంద కోట్ల విలువైన 3 వందల కేజీల హెరాయిన్, ఏకే 47 గన్, 9 MM తుపాకులు, మందుగుండు సామాగ్రిని NIA అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలింగంను NIA అధికారులు ప్రశ్నించగా.. డ్రగ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సినిమాల్లో పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పాడు. గతంలో వరలక్ష్మి దగ్గర PAగా పనిచేసినందున.. ఆమెను కూడా ప్రశ్నించాలని NIA నిర్ణయించింది. నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కి నోటీసులు కూడా అందాయి. NIA విచారణకు హాజరవడానికి కొంత టైమ్ అడిగినట్టు సమాచారం. వరలక్ష్మి దక్షిణాది భాషల్లో తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాల్లో నటిస్తూ పాపులర్ అయింది. ఈమధ్యే హనూమాన్ సినిమాలోనూ ఓ కీ రోల్‌లో నటించింది. ఇక రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్న ఈ టైమ్‌లో డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మరోవైపు నటుడు శరత్ కుమార్ తన పార్టీని ఈమధ్యే బీజేపీలో విలీనం చేయడానికి ఈ డ్రగ్స్ కేసు కూడా కారణమని భావిస్తున్నారు. మతతత్వ రాజకీయాలకు ఎన్నటికీ మద్దతు ఇవ్వబోననీ.. బీజేపీతో పొత్తు పెట్టుకునే సమస్యే లేదని గతంలో చెప్పారు శరత్ కుమార్.

కానీ, ఉన్నట్టుండి ఈమధ్యే తన సమత్వ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. దేశాభివృద్ధికి, యువతకు మేలు జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. పైగా మోడీ పాలనను ప్రశంసించారు కూడా. బీజేపీపై అంత కఠినంగా ఉండే నటుడు శరత్ కుమార్.. తన కూతురు వరలక్ష్మి కోసమే మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆమెకు NIA నోటీసులు పంపిన తర్వాతే తన పార్టీని శరత్ కుమార్ విలీనం చేసినట్టు టాక్ నడుస్తోంది. ఈ కేసులో వరలక్ష్మి ప్రమేయం ఉందని తేలితే మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.