NTR-OTT business : ఓటిటి బిజినెస్ లోకి ఎన్టీఆర్
నూనూగు మీసాల వయసులోనే టాలీవుడ్ (Tollywood) లో సరికొత్త రికార్డులు సృష్టించిన హీరో యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ నేటికీ ఆ రికార్డులు ఆయన పేరు మీదే భద్రంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఆయన కెపాసిటీ ని అర్ధం చేసుకోవచ్చు.

Add New Post ‹ DialTelugu — WordPress
నూనూగు మీసాల వయసులోనే టాలీవుడ్ (Tollywood) లో సరికొత్త రికార్డులు సృష్టించిన హీరో యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ నేటికీ ఆ రికార్డులు ఆయన పేరు మీదే భద్రంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఆయన కెపాసిటీ ని అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఆయన డైలాగ్స్ కి, డాన్స్ కి, ఫైట్స్ కి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ (NTR) గురించి వస్తున్న ఒక న్యూస్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
ఎన్టీఆర్ కి ఒక భారీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. పేరు తెలియదు గాని ఒక ఓటిటి సంస్థ ఎన్టీఆర్ ని తమ ఛానెల్ లో ప్రసారమయ్యే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించమని అడిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుకుగాను భారీ స్థాయిలో పారితోషకం గాని లేదా భాగస్వామ్యం అయినా ఆఫర్ చేసారని తెలుస్తుంది. మరి తారక్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఆ తర్వాత హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 (War 2) చెయ్యబోతున్నాడు. ప్రశాంత్ నీల్ (Prashant Neil) దర్శకత్వంలో కూడా ఒక మూవీ ఫిక్స్ అయ్యాడు మరికొద్ది రోజుల్లో అందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి. ఇక గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఓటిటి (OTT) ఆఫర్ ఆకర్షణీయంగా మారింది.