Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఒకేసారి రెండు పండుగలు.. !

రూ.500 నుంచి 700 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఆదిపురుష్ టూడీ, త్రీడీ వర్షన్‌లో ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదల కానుంది. మొదటి 3 రోజుల్లో 200 కోట్ల నుంచి 250 కోట్ల మధ్య రాబడుతుందని 18కి పైగా టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఎనాలసిస్ ఇచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 15, 2023 | 05:21 PMLast Updated on: Jun 15, 2023 | 5:21 PM

Adipurush Collections Will Break All The Records By Weekeng It Will Collecto More Than 200 Cr

Adipurush: ఆదిపురుష్ డిస్ట్రిబ్యూటర్లు ప్రభాస్ ఫ్యాన్స్ ఊగిపోయే వార్తని బాంబులా పేల్చారు. కేవలం ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌ని కోట్లూ, లక్షలు, వేలు, రూపాయలు చొప్పున పక్కగా లెక్క కట్టి ముందే షాక్ ఇస్తున్నారు. ఏకంగా రూ.220 కోట్ల 35 లక్షల పైనే ఆదిపురుష్ మూవీ శుక్ర, శని, ఆదివారాల్లో రాబట్టబోతోందట.

రూ.500 నుంచి 700 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఆదిపురుష్ టూడీ, త్రీడీ వర్షన్‌లో ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదల కానుంది. మొదటి 3 రోజుల్లో 200 కోట్ల నుంచి 250 కోట్ల మధ్య రాబడుతుందని 18కి పైగా టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఎనాలసిస్ ఇచ్చారు. దాని ప్రకారం షారుఖ్ పఠాన్ రికార్డుని కూడా రెండంటే రెండు రోజుల్లోనే ఆదిపురుష్ బ్రేక్ చేస్తుందనే అంచనాలు పెరిగాయి. ఇప్పటికే పీవీఆర్ కో సీఈవో ఫస్ట్ వీకెండ్‌లో 3 లక్షల బుక్కింగ్స్ గురించి చెప్తే.. 9 లక్షలకు పైగా బుక్కింగ్స్ జరిగాయని మరో వార్త రావటంతో ఆదిపురుష్ జోరు ఎలా ఉందో తెలుస్తోంది. ఇక ముంబై ఎగ్జిబిటర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ సన్నీ ప్రకారం పఠాన్‌ని మించేలా 70శాతం థియేటర్స్‌లో బుక్కింగ్స్‌తో టిక్కెట్లు సేల్ అయ్యాయి. ఇది పఠాన్ విషయంలో కూడా జరగలేదట.

హిందీవర్షన్ ఓపెనింగ్స్ రూ.80 నుంచి రూ.85 కోట్లు రావొచ్చని పీవీఆర్ కో సీఈవో తెలిపారు. అంటే ఎన్టీవో సంఘాలు, పొలిటీషియన్స్, రామ భక్తులు..‌ ఇలా అంతా ఆదిపురుష్‌ని నెత్తిన పెట్టుకుని మోసేలా ఉన్నారని, ఇదే పెద్ద సునామీలా మారుతుందంటున్నారు.అలా చూస్తే అన్ని వర్షన్స్‌లో ఈ మూవీ రూ.300 కోట్ల వరకు కేవలం మూడు రోజుల్లో రాబట్టొచ్చనే అంచనాలు పెరిగాయి. ఇలా రూ.100 కోట్ల ఓపెనింగ్స్, రూ.300 కోట్ల వీకెండ్ కలెక్సన్స్ అంచనాలతో ఒకేసారి ప్రభాస్ ఫ్యాన్స్‌కి రెండు పండగలొచ్చినట్టౌతోంది. ఇదే జరిగితే, ఆదిపురుష్.. బాహుబలిని మించిన మూవీ అయ్యే అవకాశం ఉంది.