Prabhas: ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్.. బాక్సాఫీస్ బద్దలైందిగా
ది మచ్ అవేటేడ్ ఇండియన్ ఫిలిం ఆదిపురుష్.. టాక్ నెగటివ్‌గా వచ్చినా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 271 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఆదిపురుష్ సినిమా.. రిలీజ్ తరువాత కూడా కలెక్షన్ల పరంపర కొనసాగిస్తోంది.

Adipurush Record Collections
జూన్ 16న రిలీజ్ ఐన ఆదిపురుష్.. నైజాంలో 13 కోట్ల 68 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక సీడెడ్-3 కోట్ల 52 లక్షలు. ఉత్తరాంధ్ర-3 కోట్ల 72 లక్షలు. ఈస్ట్-2 కోట్ల 78 లక్షలు. వెస్ట్-2 కోట్ల 24 లక్షలు. గుంటూరు-4 కోట్లు. కృష్ణా-2 కోట్లు. నెల్లూరు-90 లక్షలు. ఓవరాల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయగా.. 32 కోట్ల 84 లక్షలు షేర్ కలెక్ట్ చేసింది. కర్ణాటకలో 8 కోట్ల 57 లక్షల గ్రాస్ వసూలు చేసింది. తమిళనాడులో 2 కోట్ల 35 లక్షల గ్రాస్ రాబట్టింది. రెస్టాఫ్ ఇండియా అంతా కలుపుకుని 48 కోట్ల 24 లక్షలు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా హిందీ మాట్లాడే స్టేట్స్‌లో ఆదిపురుష్ కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఓవర్ సీస్‌లో 26 కోట్ల 75 లక్షలు కలెక్ట్ చేసినట్టు బాక్సాఫీస్ వర్గాలు చెప్తున్నాయి. దీని ప్రకారం వరల్డ్‌వైడ్‌గా మొదటి రోజే 140 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఆదిపురుష్ సినిమా. ఇక జూన్ 17,18 వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే చాన్స్ ఉంది. కానీ మొదటి రోజు చాలా మంది నుంచి వచ్చిన నెగటివ్ టాక్ ఈ కలెక్షన్స్ మీద ప్రభావం చూపే చాన్స్ ఉంది. అలా కాకుండా ప్రభాస్ మేనియా, రాముడి భక్తి ప్లస్ అయితే సోమవారాని ఆదిపురుష్ సినిమా 250 కోట్లు క్రాస్ చేసే అవకాశముంది. వీకెండ్ రెండు రోజులు ఆదిపురుష్ సినిమాకు కీలకంగా మారాయి.