ఆదిపురుష్ లాస్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఆదిపురుష్ సినిమా అనేది భారీ డిజాస్టర్. ఎవరు అవునన్నా కాదన్నా సరే ప్రభాస్ ను అప్పటి వరకు హాలీవుడ్ రేంజ్ లో చూసిన ఫ్యాన్స్ కూడా ఆ లుక్స్ చూసి విమర్శలు చేసారు. సినిమాలో చాలా సన్నివేశాలు కామెడీగా అనిపించాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 30, 2024 | 01:19 PMLast Updated on: Aug 30, 2024 | 1:19 PM

Adipurush Director Comments About Movie

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఆదిపురుష్ సినిమా అనేది భారీ డిజాస్టర్. ఎవరు అవునన్నా కాదన్నా సరే ప్రభాస్ ను అప్పటి వరకు హాలీవుడ్ రేంజ్ లో చూసిన ఫ్యాన్స్ కూడా ఆ లుక్స్ చూసి విమర్శలు చేసారు. సినిమాలో చాలా సన్నివేశాలు కామెడీగా అనిపించాయి. రాముడి బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన సినిమా కాబట్టి చాలా మంది విమర్శలు చేయడానికి కూడా ఆలోచించారు గాని సినిమా మాత్రం దారుణంగా ఉంది. బాలీవుడ్ లో ప్రభాస్ డైరెక్ట్ గా ఒక సినిమా చేస్తున్నాడని ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసారు.

దాదాపుగా 700 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చింది. తాజాగా దీనిపై దర్శకుడు ఓం రౌత్ కీలక వ్యాఖ్యలు చేసాడు. అసలు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడింది అంటూ కామెంట్స్ చేసాడు. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే 70 కోట్లు ఇండియా వైడ్ గా వసూలు చేసింది అన్నాడు ఈ డైరెక్టర్. ఇక సినిమా మొత్తం 400 కోట్ల వరకు వసూలు చేసింది అని చెప్పుకొచ్చాడు. కాని… సినిమా బడ్జెట్ 700 కోట్లు.. అంటే ఈ సినిమా లాస్ దాదాపుగా 300 కోట్లకు పైగానే ఉంది. అయితే దర్శకుడు మాత్రం లాస్ వచ్చిందనే విషయాన్ని మాత్రం అంగీకరించలేదు.

కొందరు సినిమాలో సీన్స్ రికార్డ్ చేసి ఆన్లైన్ లో ట్రోల్ చేసారని, వాళ్లకు సినిమా నచ్చలేదని కాని వాళ్ళను తాను పట్టించుకోను అన్నారు. ఒక మరాఠీ షో లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. అయితే సినిమాకు పెద్ద లాస్ ఏం రాలేదు అనడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండియన్ సినిమాలో ఇద్దరే హీరోలు తమ సినిమాలకు హిట్ ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ని కాపాడుకుంటారు అన్నాడు ఓం రౌత్. ఒకరు ప్రభాస్ కాగా మరొకరు సల్మాన్ ఖాన్ అని అన్నాడు. వీళ్ళ ఇమేజ్ కి ఏ మాత్రం డ్యామేజ్ కాదని స్పష్టం చేసాడు.