Prabhas: ఆదిపురుష్ టీం అంటే అట్లుంటది.. ఇక సునామీనే..
ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ అంగ రంగ వైభవంగా జరిగింది. ఆ పాటలు, స్టేజ్ మీద ఆ పెర్ఫామెన్స్ లు మామూలుగా లేవు. ఇక తిరుపతికి బైక్ మీద మ్యూజిక్ డైరెక్టర్లు రావటం ఏంటో, ప్రభాస్ అండ్ కో మాటల తూటాలేంటో అంతా ఓ కలలా ఫ్యాన్స్ ఊగిపోయేలా జరిగింది. ఇప్పుడు అంతకుమించేలా ఆదిపురుష్ టీం ప్రమోషన్ ని పెంచేస్తోంది.
ఆదిపురుష్ ఏ సినిమాలో ఆడుతుందో, అందులో ఒక సీటు లార్డ్ హనుమంతుడికే కేటాయిస్తారట. సో ఆ సీట్ కి టిక్కెట్ అమ్మడం జరగదు.. ప్రతీ థియేటర్స్ లో ఇలా ఓ సీటు హనుమాన్ జీ కోసం ఎదురు చూస్తుందట. కారణం రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా అక్కడికి హనుమాన్ జీ వస్తారనే అభిప్రాయముంది. ఆ సెంటిమెంట్ ని ఇలా పబ్లిసిటీ కోసం ఫిల్మ్ టీం ని వాడబోతోంది.
అప్పట్లో ఒసేయ్ రాములమ్మ మూవీ వచ్చిన కొత్తలో ఎడ్లబండి కటౌట్ ని థియేటర్స్ ముందు ఉంచేవాళ్లు. అమ్మోరు టైంలో థియేటర్స్ ని గుడిలా ముస్తాబు చేసేవాళ్లు. ఇక మాత్రుదేవో భవ సినిమా థియేటర్స్ ముందు రుమాల్లను, చీరకొంగులను పెద్ద స్థాయిలో వేలాడ దీసి, సినిమాలో ఎమోషన్స్ కన్నీరు పెట్టించేలా ఉంటాయనేంతగా ప్రమోట్ చేశారు. అదే టెక్నిక్ ని ఆదిపురుష్ కి వాడుతున్నారు. ఆదిపురుష్ ఆడే ప్రతీ థియేటర్స్ లో హనుమాన్ దేవుడికి ఓసీటుని కేటాయిస్తున్నాం అంటూ ప్రచారం పీక్స్ కి తీసుకెళుతోంది ఫిల్మ్ టీం.