Prabhas: ఇండియాలో ఆ రికార్డ్ సాధించిన ఏకైక హీరో ప్రభాస్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. కథ ఎలా ఉన్నా, క్యారెక్టర్ ఏదైనా.. స్క్రీన్ మీద ప్రభాస్ కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్‌కు పూనకాలే.

Adipurush has earned 140 crores on its first day, making Prabhas the first actor to cross the 100 crores mark on its first day in India.
ఆరడుగుల బుల్లెట్ నడిస్తే ఎలా ఉంటుందో సిల్వర్ స్క్రీన్ మీద ప్రభాస్ అలానే ఉంటాడు. ఇంతటి విపరీతమై ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ ఇండియాలోనే ఏ హీరో సాధించని రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ డే 100 కలెక్షన్స్ క్రాస్ చేయడంలో హ్యాట్రిక్ కొట్టాడు. రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి-2 సినిమా మొదటి రోజే వరల్డ్ వైడ్‌గా 122 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తరువాత సుజీత్ డైరెక్షన్‌లో వచ్చిన సాహో సినిమా కూడా ఫస్ట్ డే కలెక్షన్ 100 కోట్లు క్రాస్ చేసింది.
ఇప్పుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్ రాముడిగా వచ్చిన ఆదిపురుష్ సినిమా ఫస్ట్ డే 140 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇలా 3 సినిమాలతో ఫస్ట్ డేనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు. ఇక్కడ హైలెట్ పాయింట్ ఏంటి అంటే బాహుబలి తప్ప మిగిలిన రెండు సినిమాలు మొదటి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు వచ్చిన ఆదిపురుష్ కంటే సాహో ఏకంగా ఫ్లాప్‌గా నిలిచింది.
కానీ మొదటి రోజు మాత్రం కాసుల వర్షం కురిపించింది. ఆదిపురుష్ సినిమాపై ప్రస్తుతం ట్రోలింగ్ వస్తున్నా కలెక్షన్స్ కొనసాగుతున్నాయి. నెగటివ్ టాక్ ఇంపాక్ట్ కలెక్షన్స్‌పై పడే అవకాశాలు తక్కువ అంటున్నారు విశ్లేషకులు. రెండు రోజుల వీకెండ్ పూర్తయ్యేసరికి ఆదిపురుష్ కలెక్షన్స్‌లో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.