Adipurush: ఆదిపురుష్‌ మేనియా షురూ.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్లాడిపోయిన బుక్‌ మై షో..

నార్మల్‌గానే ప్రభాస్‌ సినిమా వస్తోందంటే ఫ్యాన్స్‌ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇక ఆదిపురుష్‌ లాంటి పాన్‌ వరల్డ్‌ సినిమా అంటే సెలబ్రేషన్స్‌ ఇంకెలా ఉంటాయి. జస్ట్‌ ప్రి-రిలీజ్‌ సెలెబ్రేషన్సే జాతర చేసినట్టు చేశారు డార్లింగ్‌ ఫ్యాన్స్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 15, 2023 | 01:16 PMLast Updated on: Jun 15, 2023 | 1:16 PM

Adipurush Mania Started All Over World Bookmyshow App Crashed

Adipurush: రాముడిగా ప్రభాస్‌.. 5 వందల కోట్ల బడ్జెట్‌.. 3 గంటలు ఐఫీస్ట్‌ అందించే విజువల్స్‌.. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్‌ రిలీజ్‌ తరుణం రానే వచ్చింది. రేపు ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్‌ సినిమా రిలీజ్‌ కాబోతోంది. నార్మల్‌గానే ప్రభాస్‌ సినిమా వస్తోందంటే ఫ్యాన్స్‌ చేసే హంగామా మామూలుగా ఉండదు.

ఇక ఆదిపురుష్‌ లాంటి పాన్‌ వరల్డ్‌ సినిమా అంటే సెలబ్రేషన్స్‌ ఇంకెలా ఉంటాయి. జస్ట్‌ ప్రి-రిలీజ్‌ సెలెబ్రేషన్సే జాతర చేసినట్టు చేశారు డార్లింగ్‌ ఫ్యాన్స్‌. జూన్‌ 16న థియేటర్స్‌లోకి వస్తున్న ఆదిపురుష్‌ సినిమాకు వెల్కం చెప్తూ కర్నూలు, ఎమ్మిగనూరులో ర్యాలీ నిర్వహించారు. కాషాయ జెండాలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆదిపురుష్‌ కటౌట్‌లతో ఎద్దులబండి ర్యాలీ నిర్వహించారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ చేసిన సెలబ్రేషన్స్‌కు ఎమ్మిగనూరు మొత్తం రీసౌండ్‌ వచ్చింది. కేవలం ఎమ్మిగనూరు మాత్రమే కాదు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సెలబ్రేషన్స్‌ ఆకాశాన్నంటాయి. ఇక టికెట్‌ బుకింగ్‌ కూడా ఓపెన్‌ అవ్వడంతో బుక్‌ మై షోలో కూడా రీసౌండ్‌ దద్దరిల్లిపోయింది.

ఫ్లాష్‌ సేల్‌లో ఐఫోన్లు మాయమైనట్టు టికెట్లన్నీ క్షణాల్లో బుక్‌ ఐపోయాయి. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దెబ్బకు బుక్‌ మై షో సర్వల్లు క్రాష్‌ అయ్యాయి. ప్రస్తుతం దాన్ని రీసెట్‌ చేసే పనిలో ఉన్నారు ఆ సంస్థ ఇంజనీర్లు. రిలీజ్‌కు ముందే ఈ స్థాయిలో దండయాత్ర చేస్తే.. ఇక రిలీజ్‌ అయ్యాక ఆదిపురుష్‌ ఎలాంటి రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.