Adipurush: ఆదిపురుష్ మూవీ ఎంతమందిని భయపెడుతుందో తెలుసా..?

ఆదిపురుష్ రెండో ట్రైలర్ దుమ్ముదులుపుతోంది. ప్రతీ పాట తూటాలా పేలుతోంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ 850 కోట్లని తేలింది. అంతా అదిరిపోతోంది. కాని కొన్ని డౌట్లు, ఇంకొందరి భయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 7, 2023 | 06:07 PMLast Updated on: Jun 07, 2023 | 6:07 PM

Adipurush Movie Fear To Over All Team

ఆదిపురుష్ మూవీ హిట్టైతే నష్టపోయేవాళ్లు, ఫ్లాపైతే నష్టపోయేవాల్లు ఇలా వేరు వేరుగా రెండు లిస్టులు తయారయ్యాయి. హిట్టైతే క్రుతి సనన్ ఓవర్ నైట్ లో పాన్ ఇండియా హీరోయిన్అవుతుంది. అజయ్ అతుల్ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ గా సౌత్ లో భారీగా ఆఫర్ల వరద పెరుగుతుంది. ఓం రౌత్ ఒకే ఒక్కమూవీతో రాజమౌళిలా పాన్ ఇండియా లెవల్లో స్టార్ డైరెక్టర్ అవుతాడు.. ఒక వేళ రిజల్ట్ రివర్స్అయితే, ఓం రౌత్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్స్ తో పాటు వందలకోట్లు పెట్టి రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబీటర్లు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుంది.. కాని ప్రజెంట్ సీన్ చూస్తే ఆదిపురుష్ మూవీ హిట్ అవటం కాదు, సెన్సేషనే క్రియేట్ చేసేలా ఉంది.

ఇక ఆదిపురుష్ హిట్టైతే నష్టపోయేవాళ్ల లిస్ట్ చూస్తే.. బీజేపీ వ్యతిరేక పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. ఉరి, కాశ్మీర్ ఫైల్స్, కేరళా స్టోరీ ఇవన్నీ హిట్ అవటం వల్ల బీజేపీ పార్టీకి కలిసొచ్చిందని.. ఆదిపురుష్ హిట్టైతే బీజేపీ వ్యతిరేక పార్టీలకు పంచే అంటున్నారు. ఇలా ఇదోరకం విచిత్రమైన చర్చ సోషల్ మీడియాలో పెరిగింది.