Adipurush: రాముడు లేని ఆదిపురుష్.. ఫ్యాన్స్ భయపడ్డట్టే జరిగింది..!
ఈ సినిమాలో కథ గురించి చెప్పాల్సిన పని లేదు. రామాయణం మొత్తం కాకుండా కేవలం రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం, రామ రావణుల యుద్ధం మాత్రమే చూపించారు. ఈ ఒక్క ఘట్టాన్ని చూపించడానికే 3 గంటలు డ్యురేషన్ తీసుకోవడంతో సినిమా కాస్త ల్యాగ్‌గా అనిపించింది.
Adipurush: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయ్యింది. ఎక్స్‌ట్రా షోలకు ప్రభుత్వం అనుమతివ్వడంతో ఉదయం 4 గంటలకే ఫస్ట్ షో పడిపోయింది. అయితే ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంత మంది సినిమా చాలా బాగుంది అంటే.. కొందరు మాత్రం రాడ్ సినిమా అంటున్నారు.
ఈ సినిమాలో కథ గురించి చెప్పాల్సిన పని లేదు. రామాయణం మొత్తం కాకుండా కేవలం రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం, రామ రావణుల యుద్ధం మాత్రమే చూపించారు. ఈ ఒక్క ఘట్టాన్ని చూపించడానికే 3 గంటలు డ్యురేషన్ తీసుకోవడంతో సినిమా కాస్త ల్యాగ్‌గా అనిపించింది. ఇక సినిమాలో రాముడి ఎంట్రీ సమయంలో వచ్చే ఫైట్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. ట్రైలర్ విషయంలో అంతా దేని గురించి భయపడ్డారో సినిమాలో కూడా అదే జరిగింది. రావణాసురుడు రాక్షసుడిలా కాకుండా చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. చాలా సీన్స్‌లో గ్రాఫిక్స్ నాసిరకంగా కనిపించాయి. దీనికేనా 5 వందల కోట్లు ఖర్చు పెట్టిందని ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇక సినిమాలో రాముడి క్యారెక్టర్ లెంత్ ఎక్కువే ఉన్నా.. డైలాగ్స్ మాత్రం లేవు.
మొత్తం సినిమాలో రాముడికి 10 కూడా డైలాగ్స్ లేవు. ఆ డైలాగ్స్ కూడా ట్రైలర్‌లో రివీల్ చేసినవే. ఆదిపురుష్‌లో రాముడి కంటే హనుమంతుడికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చనట్టుగా అనిపించింది. అందరికంటే ఆయన క్యారెక్టర్ చాలా ఇంప్రెస్సివ్‌గా ఉంది. ఇక హనుమాన్ అంటేనే నిత్యం రామనామం జపించే భక్తుడు. కానీ ఆదిపురుష్ సినిమాలో ఒక్కసారి కూడా హనుమాన్ జైశ్రీరాం అనలేదు. ట్రైలర్‌లో నా రాముడి కథ అంటూ మొదలు పెట్టాడు కానీ.. సినిమాలో మాత్రం రాముడు హనుమంతుడికి పరాయివాడు అయిపోయాడు. ఇది ఆదిపురుష్ సినిమాకు అన్నిటికంటే పెద్ద డ్రాబ్యాక్. జైశ్రీరాం అనే పాట తప్పితే ఎక్కడా ఎవరూ రాముడికి జేజేలు పలకలేదు. రాముడు బాణం ఎక్కుపెడితే వెనక్కి తీసుకోడు అనేది మనం తరతరాలుగా వింటున్నాం. అలాంటిది ఆదిపురుష్ సినిమాలో ఏకంగా బ్రాహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టి వెనక్కి తీసుకున్నాడు రాముడు.
ఇలా సినిమాలో చాలా సార్లు ఎక్కుపెట్టిన బాణాన్ని వెనక్కి తీశాడు. లుక్స్ పరంగా అంతా బాగానే ఉన్నా రావణాసురుడి గెటప్ ఇంకాస్త వైల్డ్‌గా ఉంటే బాగుండేది. ఆదిపురుష్ సినిమాకు మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఎలివేషన్ షాట్స్‌లో బీజీఎంతో ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ వచ్చాయి. ప్రభాస్ పక్కన కృతి సనన్ సీతగా చాలా బాగ్ సెట్ అయ్యింది. వాళ్లిద్దరి జంట ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఈ రెండూ తప్పితే ఆదిపురుష్ సినిమాలో పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేవు. ఓవరాల్‌గా ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజైన ఆదిపురుష్ ఆడియన్స్‌కు కాస్త నిరాశే మిగిల్చిందని చెప్పాలి.