Adipurush: ఆదిపురుష్‌ సినిమాకు హనుమంతుడు వస్తాడా? సినిమా రిలీజ్‌ అయ్యే థియేటర్లలో ఓ సీటు బ్లాక్‌..!

ఆదిపురుష్‌ రిలీజ్‌ అయ్యే ప్రతీ థియేటర్‌లో ఓ సీట్‌ ఖాళీగా ఉంచబోతున్నట్టు సమాచారం. ఒక్క టికెట్‌ మాత్రం అమ్మకుండా ఆ సీట్‌ను ఖాళీగానే ఉంచబోతున్నారట. ఆ సీటు హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచబోతున్నట్టు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 6, 2023 | 11:16 AMLast Updated on: Jun 06, 2023 | 11:16 AM

Adipurush Team To Dedicate 1 Seat In Every Theatre To Lord Hanuman

Adipurush: ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్న ఆదిపురుష్‌ సినిమా జూన్‌ 16న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికుల్లో కూడా ఓ రేంజ్‌ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్‌ విషయంలో ఓ న్యూస్‌ ఇప్పుడు టాలీవుడ్‌ వర్గాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఆదిపురుష్‌ రిలీజ్‌ అయ్యే ప్రతీ థియేటర్‌లో ఓ సీట్‌ ఖాళీగా ఉంచబోతున్నట్టు సమాచారం. ఒక్క టికెట్‌ మాత్రం అమ్మకుండా ఆ సీట్‌ను ఖాళీగానే ఉంచబోతున్నారట. ఆ సీటు హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచబోతున్నట్టు తెలుస్తోంది. రామాయణ పారాయణం జరిగే ప్రతీ చోటుకు హనుమంతుడు వస్తాడనేది హిందువుల నమ్మకం. శ్రీరాముడి అరణ్యవాసం, రావణాసురుడితో యుద్ధం మొత్తం ఆదిపురుష్‌ సినిమాలో చూపించబోతున్నారు. రామాయణమే కథగా వస్తున్న ఈ సినిమాకు కూడా హనుమంతుడు వస్తాడనేది నమ్మకం. ఆ నమ్మకం కారణంగానే ప్రతీ థియేటర్లో ఓ సీటు ఖాళీగా ఉంచబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీని గురించి మూవీ యూనిట్‌ ఎక్కడా అధికారికంగా ప్రస్తావించకపోయినా.. ఒక టికెట్‌ మాత్రం అమ్మకుండా ఉంచబోతున్నట్టు సమాచారం.

ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఆదిపురుష్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఈరోజు తిరుపతిలో గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ ఈవెంట్‌కు చినజీయర్‌స్వామి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఆదిపురుష్‌ సినిమా నుంచి మరో ట్రైలర్‌ను కూడా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఆదిపురుష్‌ సినిమా ఇండియన్‌ సినిమాల్లో ఎలాంటి హిస్టరీ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.