Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ కి కూడా ట్రోలింగ్ తప్పలేదు

ఆదిపురుష్‌ టీజర్‌ ట్రోలింగ్‌ బారిన పడ్డాక ట్రైలర్‌ ఇంకెన్ని విమర్శలు కొని తెచ్చుకుంటుందేమో అనుకున్నారు. టీజర్‌లో చేసిన తప్పులే మళ్లీ చేస్తారా? ఈసారి ఎలాంటి విమర్శలు వస్తాయా? అని డార్లింగ్‌ ఫ్యాన్స్ భయపడిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 9, 2023 | 05:52 PMLast Updated on: May 09, 2023 | 5:52 PM

Adipurush Trailer Trools

ఆదిపురుష్‌పై వున్న హై ఎక్స్‌పెక్టేషన్స్‌ను టీజర్ ఒక్కసారిగా నీరుగార్చింది. రాముడిని కార్టూన్‌లా.. రావణాసుడిని ఉగ్రవాదిలా వున్నారు. సీతను స్లీవ్‌ లెస్‌లో చూపించడం ఏంటి? ఇలా చాలా విమర్శలు టీజర్‌ కొని తెచ్చుకుంది. ఈ దెబ్బకు.. లోపాలు సరిదిద్దడానికి సినిమాను ఆరు నెలలపాటు వాయిదా వేసి 100 కోట్లతో విఎఫ్‌ఎక్స్‌ మళ్లీ చేయించారు. 100 కోట్లు ఖర్చు ఊరికే పోలేదు. టీజర్‌తో పోల్చుకుంటే.. ట్రైలర్‌పై ట్రోలింగ్‌ చాలావరకు తగ్గింది. ట్రోలింగ్‌ ఎంత తగ్గినా.. ట్రైలర్‌పై కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శబరి పాత్ర పోషించిన బామ్మ ఇందిరాగాంధీ గెటప్‌లో కనిపిస్తోందంటూ ట్రోల్ చేస్తున్నారు. టీజర్‌లో రావణాసుడి గెటప్‌పై విపరీతమైన ట్రోల్స్‌ రావడంతో.. ట్రైలర్లో ఆగెటప్‌ ఎక్కడా చూపించకుండా జాగ్రత్తపడ్డారు. సీతను ఎత్తుకుపోయే సీన్‌లో మారువేషంలో మాత్రమే కనిపించాడు. ట్రైలర్‌లో ఒరిజినల్‌ గెటప్‌ కనిపించకపోవడంతో.. రావణాసురుడు టీజర్‌లో వున్నట్టే.. సినిమాలో వుంటాడేమోనన్న అనుమానం మొదలైంది.

ఆదిపురుష్‌ టీజర్‌తో పోల్చుకుంటే.. ట్రైలర్‌పై వస్తున్న ట్రోలింగ్‌ తక్కువే. చిన్ని చిన్న లోపాలు వున్నా.. జై శ్రీరామ్‌ సాంగ్‌ చాలావరకు కవర్‌ చేసేసింది. ట్రైలర్‌కు అజయ్‌ అతుల్‌ బ్యాక్‌గ్రౌండ్ హైలైట్‌గా నిలిచింది. మొత్తం మీద టీజర్ తర్వాత ట్రోలింగ్‌కు ప్రభాస్‌ కూడా డిస్టబ్‌ అయ్యాడు. పబ్లిక్‌గా ‘ఓం’ కమ్‌ టు మై రూమ్‌ అని దర్శకుడు ఓం రౌత్‌పై సీరియస్‌ అయ్యాడు. ట్రైలర్‌తో ఈ సీన్‌ మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు. సినిమా జూన్‌ 16న రిలీజ్‌ అవుతోంది.