Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్.. 70 దేశాలు.. 105 థియేటర్లలో విడుదల.. అక్కడే అసలు ట్విస్ట్..?

త్రీడీతోపాటు 2డీలో కూడా ఈ ట్రైలర్ విడుదలవుతుంది. దీని కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలయ్యే 105 థియేటర్ల లిస్ట్ కూడా ప్రకటించేశారు. అంతా బాగానే ఉంది కానీ.. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 6, 2023 | 06:07 PMLast Updated on: May 06, 2023 | 6:07 PM

Adipurush Trailer Will Be Released On Monday But There Will Be A Twist

Adipurush Trailer: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ ట్రైలర్ ఈ నెల 9న రిలీజ్ కానుంది. 70 దేశాల్లో ఈ ట్రైలర్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. కేవలం ఇండియాలోనే 105 స్క్రీన్స్‌లో లాంచ్ కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రాలతోపాటు 69 ఇతర దేశాల్లో ఆదిపురుష్ ట్రైలర్‌ని లాంచ్ చేయబోతోంది సినిమా టీం. త్రీడీతోపాటు 2డీలో కూడా ఈ ట్రైలర్ విడుదలవుతుంది. దీని కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమా విడుదలయ్యే 105 థియేటర్ల లిస్ట్ కూడా ప్రకటించేశారు. అంతా బాగానే ఉంది కానీ.. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ట్రైలర్ రిలీజ్ అవుతోంది కదా..! థియేటర్లో ట్రైలర్ చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే థియేటర్లలో ట్రైలర్‌ను ఫ్రీగా ప్రదర్శించడం లేదనే ప్రచారం మొదలైంది. దీని కోసం బేసిక్ ఫీ వసూలు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ లాంచ్ అంటే బేసిగ్గానే ఫ్రీ ఎంట్రీ ఉండాలి. కాని ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ అయ్యే థియేటర్స్‌లో బేసిక్ టిక్కెట్ ఫీ కడితేనే ఎంట్రీ అనే ప్రచారం జరుగుతోంది. ఎంత ఫ్యాన్స్ అయినా థియేటర్స్‌లో ట్రైలర్ కోసమే అంత చెల్లిస్తారా అనే డౌట్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే థియేటర్స్‌లో రిలీజ్ అయ్యేది సినిమా కాదు. ట్రైలర్ మాత్రమే. అది కూడా 3 నిమిషాల 40 సెకన్లు అంటున్నారు.

ఆ మాత్రానికే థియేటర్స్‌లో బేసిక్ టిక్కెట్ ఫీ.. అంటే కనీసం 100 రూపాయలు చెల్లించాలంటే కష్టమే. ఇష్టమైన హీరో కోసం క్యూ కట్టే ఫ్యాన్స్ రావటం కామన్. కాని దాన్ని క్యాష్ చేసుకునే ప్రక్రియే బాలేదంటున్నారు. ఐతే ఇదంతా ఫ్రీ అనే మరో టాక్ కూడా పెరిగింది. కానీ థియేటర్స్‌కి వెళితే కానీ అసలు విషయం తెలియదు.