Allu Arjun: ఉరి వేసినోడే.. అల్లు అర్జున్ ని వెంటాడుతున్నాడు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఉరి స్పెషలిస్ట్ వెంటాడుతున్నాడు. వేటాడుతున్నాడు. వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నాడు. మరణం లేని జీవితం ప్రసాదిస్తా అనికూడా అంటున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 13, 2023 | 04:12 PMLast Updated on: May 13, 2023 | 4:12 PM

Adithya Dhar With Allu Arjun

ఇంతకి అసలు స్టోరీ ఏంటంటే, బాలీవుడ్ బాక్సాఫీస్ ని ఊపేసిన ఉరి మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పుడో కథతో బన్నీని కలిశాడట. 800 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీని పట్టాలెక్కిస్తా అంటున్నాడట.

మహాభారతంలో అశ్వద్ధామ చేసిన పాపాలకు, కృష్ణుడు తనని శపిస్తాడు. మరణం లేకుండా ఎల్లకాలం చస్తూ బతకమంటాడు.. అందుకే ఇప్పటికీ అశ్వద్ధామా ఇన్నేళ్లు గడిచినా, హిమాలయాల్లోనో, లేదంటే మనచూట్టూనే మనలో కలిసిపోయి బతికేస్తున్నాడనే నమ్మకాలున్నాయి.. ఇప్పుడా పాత్ర బన్నీ వేయబోతున్నాడట.

అసలే ఉరి లాంటి మూవీ తీసిన దర్శకుడు, ఆ సినిమా తో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్.. అలాంటి వ్యక్తి కథ చెబితే బన్నీ నోచెబుతాడా.? అందుకే యష్ అన్నాడట. పుష్ప 2 చేస్తున్న బన్నీ, తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి సినిమాలు లైన్లో పెట్టాడు. అయితే 2025 లో అశ్వద్ధామ పట్టాలెక్కేలా బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ప్లాన్ చేశాడట.